సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరబాద్ ఎల్బి స్టేడియంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్న ఈ ఈవెంట్ మొదలవడమే చిరు పాటతో మొదలు పెట్టాడు సింగర్ సిం హా. మహేష్ మెడ్లీ సాంగ్స్ తో మొదలైన ఈ ఈవెంట్ ఈవెంట్ గెస్ట్ గా వస్తున్నందుకు మెగాస్టార్ చిరంజీవి సైరా పాటతో మొదలు పెట్టారు. సైరా టైటిల్ సాంగ్ తో ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది.

 

సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకీవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సింగర్ సిం హా మహేష్ సాంగ్స్ మెడ్లీతో అదరగొట్టాడు. ఇప్పటికే ఎల్బి స్టేడియం కు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ కూడా భారీ సంఖ్యలో అటెండ్ అయ్యారు. ఎల్బి స్టేడియం మొత్తం ఇద్దరు అభిమాన హీరోలతో కిక్కిరిసిపోయిందని చెప్పొచ్చు. మహేష్ భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎల్బి స్టేడియంలో జరిగింది. ఆ సినిమా ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చారు.

 

ఇక సుమ యాంకరింగ్ తో మొదలైన సరిలేరు ఈవెంట్ సత్య డ్యాన్స్ ట్రూప్ తో మెగాస్టార్ చిరంజీవి మెడ్లీ సాంగ్స్ కు డ్యాన్స్ వేశారు. మెగాస్టార్ గెస్ట్ గా వస్తున్న కారణంగా చిరు సాంగ్స్ కు కూడా ఈవెంట్ లో ప్రాముఖ్యత ఇచ్చారు. ఈవెంట్ కు వచ్చిన మెగా ఫ్యాన్స్ ను కూడా మెప్పించేలా మెగాస్టార్ చిరంజీవి సాంగ్స్ తో అలరించారు. పాటలొస్తేనే మెగా ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ ఈలలు, గోలలతో స్టేడియం దద్దలిల్లుపోతుంటే ఇక చిరు, మహేష్ మాట్లాడే టైంలో ఫ్యాస్ హంగామా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: