ఎప్పుడు లేనిది ఈ సారి సంక్రాంతికి పెద్ద సినిమాల విషయంలో పెద్ద గందరగోళం నెలకొంది. గత సంవత్సరం ఇలాంటి సమస్య రాలేదు. కానీ ఈ సారి మాత్రం పెద్ద సమస్య వచ్చి పడింది. అదే థియోటర్స్ సమస్య. 5 సినిమాలున్నాయి. అందుకే ఈ గోలంతా. కానీ సమస్య అంతా ఆ రెండు సినిమాలతోనే. అయితే సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ల ఇష్యూ ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది.  గత వారం రోజులుగా జరిగిన హంగామాకు తెరపడింది. షెడ్యూల్ ప్రకారమే 'సరిలేరు నీకెవ్వరు'  జనవరి 11 న.. 'అల వైకుంఠపురములో' 12 న విడుదల కానున్నాయి. మరి ఈ విషయంలో పరిష్కారం దొరకడంతో తెరవెనుక ఏం జరిగింది? డేట్ మార్చకుండా వెనక్కు తగ్గి బన్నీ గొప్పవాడు అయ్యాడా? తన మాటమీదే ఉంది మహేష్ మొనగాడు అయ్యాడా? ఈ సమస్య పరిష్కారం కోసం ప్రొడ్యూసర్స్ గిల్డ్ వారు ప్రయత్నం చేశారని.. వారి వల్లే ఈ రిలీజ్ డేట్ల దోబూచులాటకు శుభం కార్డు పడిందని ప్రచారం జరిగింది. 

 

ముందుగా అనుకున్న థియేటర్ల ఒప్పందం ప్రకారమే రెండు సినిమాలకు థియేటర్లు లభించేలా సర్దుబాటు జరిగిందట.  11 న మొదటి మహేష్ సినిమాకు మూడు థియేటర్లు ఇచ్చారు అనుకోండి.. తర్వాత వచ్చే బన్నీ సినిమా రెండు రోజులు రెండు థియేటర్లలో ప్రదర్శిస్తారు. అంటే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి ఓపెనింగ్ డే కాస్త ఎడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా రెండు సినిమాలకు థియేటర్లు సమానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మొదటి వారంతం తర్వాత 50-50 షేరింగ్ లో ఈ సినిమాలకు థియేటర్లు కేటాయిస్తారు. అయితే రిలీజ్ రోజు వచ్చిన టాక్ ని బట్టి ఈ 50-50 షేరింగ్ లో మార్పు రావచ్చు.

 

నిజానికి ఇది ముందు అనుకున్న పర్‌ఫెక్ట్ అగ్రిమెంట్.  అయితే మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేసి అనధికారికంగా ఎక్కువ థియేటర్లకోసం విశ్వ ప్రయత్నాలు చేయడం.. 12 వ తేదీ కూడా ఎక్కువ థియేటర్లు ఉంచుకుంటున్నారన్న మ్యాటర్ బయటకు లీకవడం తో బన్నీ టీమ్ కు కోపం వచ్చి తమ సినిమాను ప్రీ పోన్ చేస్తామని అన్నారు. దీంతో మొదటికే మోసం వస్తుందని అర్థం చేసుకున్న 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ ఇప్పుడు కాంప్రమైజ్ అవుదాం అంటున్నారట. కానీ ఈ విషయలో అనధికారికంగా థియేటర్లు బ్లాక్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్ రాజు టీం ఇప్పుడు థియేటర్ల విషయంలో 'అల వైకుంఠపురములో' టీమ్ కు ఇబ్బంది రాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఈ ఇష్యూ సాల్వ్ అయిందట.

 

ఇక ఇదిలా ఉంటే అసలు దిల్ రాజు టీం మహేష్ కోసం అనధికారికంగా థియేటర్లు బ్లాక్ చేశారా లేదా అనే విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది చూపించి ఆవేశంగా 10 వ తేదీన తమ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించడం.. ఇప్పుడు మళ్లీ కాంప్రమైజ్ కు రావడంతో బన్నీ టీమ్ తొందరపాటు అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పోటీలన్నీ పక్కన పెడితే అసలు సిసలు బాక్స్ ఆఫీస్ పోటీలో ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో రిలీజ్ అయితే గాని తెలీదు. అయితే మహేష్ ఫ్యాన్స్ మా సినిమానే బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోండి అంటే బన్ని ఫ్యాన్స్ మా సినిమానే బ్లాక్ బస్టర్ మీరు రాసే పెట్టుకోండి అంటున్న సవాల్ చేసుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: