కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. పౌరసత్వ  సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎంతోమంది రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు సైతం నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇక పలు రాష్ట్రాలలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు ఉధృతంగా  మారుతున్నరాయి.  ఉత్తరప్రదేశ్లో అయితే ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఏకంగా ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేసి విధ్వంసం సృష్టిస్తున్నారు ఆందోళనకారులు. 

 

 అంతేకాకుండా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం తమ రాష్ట్ర పరిధిలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని అంటూ ఇప్పటికే తేల్చి చెప్పారు. పలువురు బీజేపీ ముఖ్య మంత్రులు సైతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తూ ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టం పై నిరసనలు వ్యక్తం  చేస్తున్న వారిని శాంతింప పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పౌరసత్వం సవరణ చట్టం పై దేశంలో వ్యతిరేక పవనాలు వీస్తుండటం పట్ల కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. పౌరసత్వ సవరణ చట్టం యొక్క ప్రాధాన్యతను దేశవ్యాప్తంగా తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తలపిస్తోంది. 

 


 ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖుల కోసం ఓ విందు కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు  కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది . పౌరసత్వ సవరణ చట్టం పై బాలీవుడ్ ప్రముఖులకు అవగాహన కల్పించడమే ఈ విందు  యొక్క ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. సవరణ చట్టం అమలు తీరు చట్టంలోని అంశాల గురించి బాలీవుడ్  ప్రముఖులకు  వివరిస్తారు. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ లో ఈ విందును ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రమంత్రి పియూష్ గోషాల్ విందుకు  హాజరవుతారు. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్ ఫర్హాన్ అక్తర్ రితేశ్ సిద్వానీ  కబీర్ ఖాన్ తదితరులు ఈ విందులో  పాల్గొననున్నారు. ఇలాగైనా అందరికీ అవగాహన కల్పించి పౌరసత్వ సవరణ చట్టానికి అందరూ మద్దతు పలికేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: