టాలీవుడ్ లో ఎప్పటి నుంచి నివురు గప్పిన నిప్పులా ఉన్న మా  అసోసియేషన్ గొడవలు మొన్న మా డైరీ ఆవిష్కరణ సందర్బంగా అతిరథ మహారథుల మద్య రచ్చ రచ్చ జరిగింది.  చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణం రాజు, సుబ్బిరామిరెడ్డి, జయసుధ వేధికపై ఉండగా డాక్డర్ రాజశేఖర్ వచ్చి ఆవేషంగా మాట్లాడారు.   అంతకు ముందు మంచి ఉింటే మైకులో చెబుదాం, చెడదు ఉంటే చెవిలో చెబుదాం అని చిరంజీవి మాలో నెలకొన్న విభేధాల గురించి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.దాంతో ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేతిలోంచి రాజశేఖర్ మైక్ లాక్కుని ఆవేశంగా ప్రసంగించారు.  మా లో ఎన్నో గొడవలు ఉన్నాయని.. నాకు మా వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని.. ఇటీవల బెంజ్ కారు పోయిందని.. తన ఇంట్లో గొడవలు కూడా జరుగుతున్నాయని ఇక్కడ అంతా మోసం జరుగుతుందని.. పైకి చెప్పేది ఒకటి ఇక్కడ జరుగుతుంది ఒకటని మాట్లాడారు.  

 

పక్కన జయసుధ లాంటి పెద్దలు వారిస్తున్నా కూడా ఆపకుండా ఎంతో ఆవేశంగా మాట్లాడారు. దాంతో పక్కనే చిరంజీవి ఇది కావాలని చేస్తున్న రచ్చ అని దీనిపై క్రమశి క్షణ చర్య తీసుకోవాలని అన్నారు. రాజశేఖర్ మాటలతో తీవ్ర అసహనానికి గురైన చిరంజీవి... తాను చెప్పిన మాటకు విలువ ఇవ్వడం లేదని, తమ మాటలకు గౌరవం లేనప్పుడు తామంతా ఇక్కడ ఎందుకు ఉండాలని, ఎందుకు సభను రసాభాస చేయడమని, రాజశేఖర్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.  

 

తర్వాత నాటకీయంగా రాజశేఖర్ తన రాజీనామాను సమర్పించారు.   అయితే అధ్యక్షుడు నరేష్ వ్యవహారశైలి నచ్చకే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో రాజశేఖర్ తెలిపారు. అయితే ఆదివారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో రాజశేఖర్ రాజీనామాను ‘మా’ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు అధ్యక్షుడు నరేష్, ముఖ్య సలహాదారు కృష్ణంరాజు సంతకాలతో కూడిన ఒక ప్రెస్ నోట్‌ను ‘మా’ ఆదివారం విడుదల చేసింది. మొత్తానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ రాజశేఖర్ రాజీనామాను ఆమోదించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: