దిల్ రాజు నైజాం లో నంబర్ వన్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య దిల్ రాజు కి అంతగా కలిసి రావడం లేదు.బాగానే లాస్ అవుతున్నారు. ఇక మహర్షి నైజాం క్లోజింగ్ ఫిగర్..ముఫై నుంచి ముఫై రెండుకోట్లు. ఉత్తరాంధ్ర క్లోజింగ్ ఫిగర్ 10 కోట్లకు పైగానే. అంటే రెండు కలిపి దాదాపు 40 కోట్లకు పైగానే. మరి ఈ ఫిగర్ల ప్రకారం సరిలేరు నీకెవ్వరు సినిమా ఆ రెండు ఏరియాలకు ఎంతకు అమ్మాలి. టాలీవుడ్ పెద్ద సినిమాల లెక్కల్లో అయితే 40 కోట్లకు విక్రయిస్తారు. లేదా అంతకు కాస్త లోపుగా ఇస్తారు.

 

కానీ సరిలేరు నీకెవ్వరు సినిమాను నైజాం, వైజాగ్ కలిపి దిల్ రాజుకు ముఫై కోట్లకు ఇచ్చేసారు. ఇది జాక్ పాట్ కాక మరేమిటి? విడుదలకు ముందే జాక్ పాట్ కొట్టేసినట్లే కదా? ఎలాగూ పండగ సీజన్. అదనపు ఆటలు, అదనపు రేట్లు, అందువల్ల మాంచి ఫిగర్లు కళ్ల ముందుకు వస్తాయి. సినిమా హిట్ అయితే ఇక లాభాలే లాభాలు. అందులో సందేహం లేదు అని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 

 

ఇదిలా వుంటే అల వైకుంఠపురములో సినిమా కూడా నైజాం, విశాఖ దిల్ రాజుదే. ఆ సినిమాను 28 కోట్ల కు రెండు ఏరియాలు కలిపి తీసుకున్నట్లు తాజా సమాచారం. అక్కడ కూడా లాభమే. కేవలం విశాఖ ఒక్కటే పది కోట్లకు ఆఫర్ వున్నా, రెండు ఏరియాలు కలిపి 28 కోట్లకు ఇవ్వడం అంటే మరో జాక్ పాట్ అనే చెప్పాలి. బన్నీ డిజాస్టర్ సినిమా నా పేరు సూర్య కూడా ఈ రెండు ఏరియాలు కలిపి 18 కోట్ల వరకు వసూలు చేసింది. డిజె సినిమా రెండు ఏరియాలు కలిపి 27 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక బన్ని సరైనోడు కూడా 28 కోట్ల వరకు వసూలు చేసింది.

 

అవన్నీ అప్పటి రేట్లు. ఇప్పుడు విశాఖ మార్కెట్ బాగా పెరిగింది. నైజాం, విశాఖల్లో మల్టీ ఫ్లెక్స్ లు భయంకరంగా పెరిగాయి. అందువల్ల ఆ లెక్కలో కూడా దిల్ రాజుకు బన్నీ సినిమా కూడా జాక్ పాట్ రేటుకే వచ్చిందనుకోవాలి. ఈ రెండు సినిమాలు గనక బ్లాక్ బస్టర్ అయితే ఇక దిల్ రాజు మళ్ళీ 2019 లో పోగొట్టుకున్నదంతా నాలుగు రెట్లు వచ్చేస్తుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: