ఒకే వేదికపై సూపర్ స్టార్, మెగాస్టార్ కలిస్తే ఎలా ఉంటుంది.. వినడానికే ఊహ అదిరిపోయింది కదూ.. అదే నిజమైతే మరి.. అవునండీ.. ఈ రోజు జరగబోయే మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ప్రత్యేక అతిధిగా విచ్చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్‌.బి స్టేడియం గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ కూడా ఉంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మెగా సూపర్ ఈవెంట్‌లో స్పెషల్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వనుంది. ఇక అది హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

 


సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ మాట్లాడుతూ - ``ఈరోజు నిజంగానే అద్భుత‌మైన రోజు. మా డైరెక్ట‌ర్ అనిల్‌కి కొడుకు పుట్టాడు. అలాగే మా నిర్మాత దిల్‌రాజుగారు మ‌రోసారి తాత‌గారయ్యారు. ఆయ‌నింటికి ఓ ఆడ‌పిల్ల వ‌చ్చింది. ఇన్ని మంచి విష‌యాలు ఒకేరోజు జ‌రిగింది. అన్నింటికీ మంచి మేం పిల‌వ‌గానే మెగాస్టార్ చిరంజీవిగారు ఈ వేడుక‌కి రావ‌డం గొప్ప విష‌యం. మా టీం ఈ విష‌యాన్ని ఎప్ప‌టీకి మ‌ర‌చిపోదు. ఒక్క‌డు సినిమా చూసి ఆయ‌న చెప్పిన మాట‌లు నాకెంతో ఇన్‌స్పిరేష‌న్ ఇచ్చాయి. అలాగే అర్జున్ స‌మ‌యంలో మా సెట్‌కు వ‌చ్చి నీలాంటి వాళ్లు ఇండ‌స్ట్రీకి అవ‌స‌రం.. ఇండ‌స్ట్రీ ముందుకు తీసుకెళ్లాల‌ని చెప్పిన మాట‌లు. ఇంకా నాకు గుర్తే. పోకిరి స‌మ‌యంలోనూ నాకు ఫోన్ చేస్తే నేను వెళ్లి క‌లిశాను. సినిమా గురించి, నా పెర్ఫామెన్స్ గురించి రెండుగంట‌ల పాటు మాట్లాడారు. ఆ మాట‌ల‌ను నేనింకా మ‌ర‌చిపోలేదు. ఆయ‌న ఎప్పుడు నాకు ఇన్‌స్పిరేష‌నే. 

 


భ‌ర‌త్ అనే నేను , మ‌హ‌ర్షి సినిమాలు రిలీజ్ అయిన త‌ర్వాత ఫ‌స్ట్ పోన్ కాల్ ఆయ‌న ద‌గ్గ‌ర నుండే నాకు వస్తుంది.  జ‌న‌వ‌రి 11న కూడా ఆయ‌న ద‌గ్గ‌ర నుండి తొలి ఫోన్ రావాల‌ని కోరుకుంటున్నాను. విజ‌య‌శాంతిగారితో కొడుకు దిద్దిన కాపురం త‌ర్వాత ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ ప‌నిచేశాను. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే డేడికేష‌న్‌తో ఉన్నారు. ఆమెకు మేం అవ‌కాశం ఇచ్చార‌ని ఆమె చెప్పారు కానీ.. నిజానికి ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకుని ఆమె మాకు అవ‌కాశం ఇచ్చారు. స్క్రిప్ట్ విన్న త‌ర్వాత విజ‌య‌శాంతిగారు ఒప్పుకుంటారో లేదో అన్నాను. కానీ త‌ను ఆమెను ఒప్పించాడు. భార‌తి క్యారెక్ట‌ర్‌ను ఆమె త‌ప్ప మ‌రొక‌రు చేయ‌లేరు. ఆమెకు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాం. డైరెక్ట‌ర్ అనిల్ గురించి చెప్పాలంటే.. నేను చాలా మందితో ప‌నిచేశాను కానీ, ఓ డైరెక్ట‌ర్‌లో అంత పాజిటివ్ ఎన‌ర్జీని నేనెప్పుడూ చూడ‌లేదు. నేను ప్ర‌తిరోజు ఎంజాయ్ చేస్తూ చేశాను. జూలై 4న సినిమాను స్టార్ట్ చేస్తే డిసెంబ‌ర్ 18న షూటింగ్ అయిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: