ప్రస్తుతం మహేష్ బాబు, అనిల్ రావిపూడి ల తొలి కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 11న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్శ్వర క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై మహేష్ ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఉండగా, ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, అలానే నిన్న రాత్రి రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ ఆ అంచనాలను మరింతగా పెంచడం జరిగింది. ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటిస్తుండగా, హరితేజ, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, జయప్రకాశ్ రెడ్డి, రఘు బాబు, వెన్నెల కిషోర్, సుబ్బరాజు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

 

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో ఎంతో వైభవంగా జరిగింది. ఇకపోతే ఈ ఫంక్షన్ లో ముందుగా మహేష్ బాబు మాట్లాడుతూ, చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత తమ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న విజయశాంతి గారికి కృతజ్ఞతలని, అలానే ఈ ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన చిరంజీవి గారిని ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. అయితే ఈ ఫంక్షన్ లో కొంత ఉద్వేగంగా మాట్లాడిన విజయశాంతి, కొంత రాజకీయాల మాదిరిగా ప్రసంగాలు చేయడం, ఆడియన్స్ లో కొందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత మైక్ అందుకున్న మెగాస్టార్, సూపర్ స్టార్ మహేష్ పై పొగడ్తలు కురిపించారు. తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుందని, ఎందుకంటే ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమాని దర్శకుడు అనిల్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా మలచినట్లు అర్ధం అవుతుందని మెగాస్టార్ అన్నారు. 

 

ఇక ఆ తరువాత విజయశాంతి గురించి, అలానే ఆమెతో గతంలో చేసిన సినిమాలు, ఆ తరువాత రాజకీయ జీవితం గురించి ప్రస్తావించిన మెగాస్టార్, ఇటీవల తనపై రాజకీయపరంగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ని గుర్తు చేసారు. ఆ తరువాత విజయశాంతి కూడా మెగాస్టార్ కు ధీటుగానే జవాబిచ్చారు. ఇక వీరిద్దరూ మాట్లాడుతున్న సమయంలో ఒకింత ప్రేక్షకులకు, అలానే టివిలు చూస్తున్న ఆడియన్స్ కు, అసలు జరుగుతున్న ఫంక్షన్ ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి అనే భావన ఒకింత కలిగిన మాట మాత్రం వాస్తవం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ప్రస్తుతం ఈ మ్యాటర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: