తేజ తీసిన చిత్రం సినిమా ద్వారా పరిచయమయిన ఉదయ్ కిరణ్, ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ పై వచ్చిన నువ్వు నేను ఇంకా మనసంతా నువ్వే కూడా వరుసగా హిట్ అయ్యాయి. నువ్వు నేను సినిమాలోని యువకుని పాత్రపోషణకు గానూ 2001 ఫిలింఫేర్ అవార్డ్ ఇతడ్ని వరించింది.

 

తరువాత వచ్చిన కలుసుకోవాలని సినిమాలో తన నృత్య ప్రతిభను కిరణ్ చూపాడు. శ్రీరాం సినిమా ద్వారా ఒక పరిపక్వ నటనను మనకు చూపిస్తాడు.. చిత్రం, నువ్వునేను, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. తర్వాత వచ్చిన కొన్ని ఫ్లాపుల తర్వాత 2005 లో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు.. అతి తక్కువ సినిమాలతో మంచి హిట్స్ సంపాదించాడు..

 

ఈయ‌న‌ దూకుడు చూసి చిరంజీవి కూడా తన అల్లుడు చేసుకోవాలని ఆరాటపడ్డాడు.. కానీ ఎందుకనో తెలియదు ఆ పెళ్లి జరగలేదు.. ఆతర్వాత 2012లో అక్టోబరు 24న విషితను వివాహమాడారు. 6 జనవరి 2014 న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు...

 

ఒక్కసారి గా భవిష్యత్తు బాగుంటుంది అని ఆశ పడిన హీరో ఎందుకో తెలియదు గాని ఉన్నట్లుండి అన్ని సినిమాలు సరిగా ఆడకపోవడం, సరిగా అవకాశాలు లేకపోవడం వల్ల క్రుంగి పోయాడు.. ఒకపక్క భార్యతో మనస్పర్థలు. ఇవన్నీ తట్టుకోలేక బలవంతగా ఉరివేసుకుని ఊపిరి తీసుకున్నాడు...

 

జీవితంలో విఫలమై 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మరణం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.. ఇదే రోజు చనిపోయారు.. చనిపోయి 6 సంవత్సరాలు గడుస్తున్నా ప్రేక్షకులు హృదయాలలో మెలుగుతూనే ఉన్నాడు ఉదయ్ కిరణ్... ఉదయిస్తాడు అనుకుంటే చిన్న వయసులోనే అస్తమించాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: