నందమూరి అభిమానులు ఎప్పటినుండో జూనియర్ ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ అని ఒకే ఫ్రేములో చూడాలని ఎప్పటి నుండో ఆశపడుతున్నారు. గతంలో నందమూరి తారక రామారావు జీవిత చరిత్రకు సంబంధించి బాలకృష్ణ తీసిన బయోపిక్ సందర్భంలో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేదికపై నందమూరి బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ వుండటంతో ఎంతో పులకరించిపోయారు నందమూరి అభిమానులు. అయితే ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి వస్తారని కలసి ఏదైనా సినిమా చేస్తారా అని అందరూ అనుకుంటున్న తరుణంలో తాజాగా నందమూరి అభిమానుల డాన్సులు వేసే న్యూస్ ఒకటి ఇండస్ట్రీ లో వినపడుతోంది.

 

అదేమిటంటే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ విగ్నేశ దర్శకత్వంలో  ఇటీవల నటించిన “ఎంత మంచి వాడవురా” సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పక్కన హీరోయిన్ గా మెహరీన్ నటించడం జరిగింది. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఈ సినిమాని ఉమేష్ గుప్తా సుభాష్ గుప్తా నిర్మించగా గోపీసుందర్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 15వ తారీఖున సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ మరియు పోస్టర్లు సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తున్నారు నిర్మాతలు.

 

అయితే సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకకు కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. దీంతో నందమూరి అభిమానులు ఎంత మంచి వాడవురా ప్రీ రిలీజ్ వేడుక చాలా ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రూలర్ సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత వస్తున్న నందమూరి ఫ్యామిలీ హీరో సినిమా ఎంత మంచి వాడవురా గ్యారెంటీగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: