టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా పలు ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అంశాల కలబోతగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లో ఎంతో వైభవంగా జరిగింది. ఇక ఇదే వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, తన చేతులమీదుగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా తప్పకుండా ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు ప్రేక్షకులు. ఇకపోతే ఈ వేడుక ప్రత్యేకంగా విచ్చేసిన మెగాస్టార్, సూపర్ స్టార్ మహేష్ బాబు, అలానే సినిమా యూనిట్ తో పాటు ఈ సినిమాతో చాలా గ్యాప్ తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విజయశాంతి పై కూడా పొగడ్తలు కురిపించారు. 

 

ముందుగా మహేష్ వ్యక్తిత్వం, మంచితనం గురించి మాట్లాడిన మెగాస్టార్, ఈ సినిమా పోస్టర్ ఇటీవల ఒక పత్రిక తిరగేస్తుండగా చూసానని, అయితే అనుకోకుండా ఇదే సినిమా వేడుకకు తాను ప్రత్యేక అతిథిగా వస్తానని భావించలేదని అన్నారు. ఇక ఆ తరువాత విజయశాంతిని స్టేజ్ మీద దగ్గరకు పిలిచి గత స్మృతులు గుర్తు చేసుకున్న మెగాస్టార్, ఆమెతో కలిసి తాను నటించిన 20 సినిమాల విషయాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడారు. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత విజయశాంతిని, తాను ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళి కలవడం, కలిసి మాట్లాడుకోవడం ఈ స్టేజ్ మీదనే జరుగుతోందని, ఈ విధంగా విజయశాంతికి కలిసే అవకాశం కల్పించిన సూపర్ స్టార్ మహేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్. ఇక ఆయన మాట్లాడుతూ, గతంలో ఒకానొక రాజకీయ సందర్భంలో తనపై విజయశాంతి విమర్శలు చేసినప్పటికీ, తాను మాత్రమె ఆమెను పల్లెత్తు మాటకూడా అనలేదని అన్నారు. 

 

అయితే అందుకు బదులిచ్చిన విజయశాంతి, మీరు అందరి ముందు అనివుండకపోవచ్చు, కానీ వెనుక నుండి అని ఉండవచ్చు కదా అన్నారు. ముందు నుండే అనని నేను, వెనుక నుండి ఏమి అంటాను చెప్పు విజయశాంతి అని అన్నారు. రాజకీయాల్లో ఉంటె శత్రువులు పెరుగుతారని, అదే సినిమాల్లో ఉంటె ఎంతో ప్రేమపూరిత వాతావరణంతో ఎంతోమంది మిత్రులు పరిచయం అవుతారనే విషయం తనకు తెలిసిందని అన్నారు. అయితే చిరు, విజయశాంతిల కొద్దిపాటి సరదా సంభాషణ చాలాసేపు సాగడంతో, ఒకింత ఫంక్షన్ కు వచ్చిన ఆడియన్స్ లో కొందరికి మాత్రం, ప్చ్, మెగాస్టార్ చిరంజీవి ఏంటి ఈ ఫంక్షన్ లో ఇలా మాట్లాడుతున్నారు అనే భావన కలిగిందనేది మాత్రం వాస్తవం అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: