సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఈ వేడుకకు వేదికైంది. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. దీంతో ఈ మూవీపై ప్యాన్స్ లో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇటు సూపర్ స్టార్ మహేశ్...అటు...మెగాస్టార్ చిరంజీవి అగ్ర హీరోలు ఇద్దరూ ఒకే వేదికను షేర్ చేసుకుంటుండటంతో ఎల్బీ స్టేడియానికి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ క్యూ కట్టారు. తమ అభిమాన హీరోలను ఒకే దగ్గర చూసేందుకు ఫ్యాన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

 

న‌ట విశ్వ భార‌తి విజ‌య‌శాంతి మాట్లాడుతూ - ``మెగాస్టార్ చిరంజీవిగారికి, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌గారికి, మా తోటి న‌టీన‌టుల‌కు, టెక్నీషియ‌న్స్‌కి, మా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడిగారికి, నిర్మాత‌లు అనీల్ సుంక‌ర‌గారికి, దిల్‌రాజుగారికి థ్యాంక్స్‌.  1979 నుండి 2020 వ‌ర‌కు నాది లాంగ్ జ‌ర్నీ. మీ అంద‌రితో క‌లిసి న‌డిచాను. న‌న్ను ఆ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు హృద‌య‌పూర్వ‌కంగా ధ‌న్య‌వాదాలు. మ‌ర‌చిపోలేని జ‌ర్నీ. యాక్ష‌న్ మూవీస్‌, కామెడీ మూవీస్, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేశాను.. మెగాస్టార్ చిరంజీవిగారితో క‌లిసి ప‌లు సినిమాలు చేశాను. అణ‌గ‌దొక్క‌బ‌డుతున్న మ‌హిళ‌లంద‌రికీ నేనున్నాను మీకోసం ధైర్యంగా అడుగు ముందుకేయండి అని నా సినిమాలు చాలా సంద‌ర్భాల్లో చెప్పాయి. ఎవ‌రో వ‌స్తార‌ని, ఏదో చేస్తార‌ని ఎదురుచూడ‌కండి.. రేప‌టి జీవితం మీదే.. మ‌హిళాశ‌క్తులు మీరే. 1988లో లిటిల్ స్టార్ మ‌హేశ్‌తో కృష్ణ‌గారి డైరెక్ష‌న్‌లో నేను న‌టించాను. నేను మ‌ళ్లీ మ‌హేశ్‌బాబుతో ప‌నిచేస్తాన‌ని అనుకోలేదు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి న‌న్ను ప‌రిచ‌యం చేసింది హీరో కృష్ణ‌గారు. నా మొద‌టి హీరో ఆయ‌నే. విజ‌య నిర్మల‌గారిని కూడా ఈరోజు మ‌ర‌చిపోలేను.

 

కృష్ణగారు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. మ‌ళ్లీ రీ ఎంట్రీ మ‌హేశ్‌గారితో కావ‌డం ఆశ్చ‌ర్య‌కరంగా ఉంది. మహేశ్ అబ్బాయి గౌత‌మ్‌తో కూడా యాక్ట్ చేయ‌డానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మ‌హేశ్ బంగారం. డౌన్ టు ఎర్త్‌. ఒక‌మాట‌లో చెప్పాలంటే.. బంగారం. సూప‌ర్‌స్టార్ అనే ప‌దానికి అర్థం మ‌హేశ్‌బాబుగారు. అంచెలంచెలుగా ఎద‌గ‌డం, ఒద‌గ‌డం, నేర్చుకోవ‌డం, మీ అభిమానాన్ని సంపాదించ‌డం చూస్తుంటే.. మ‌హేశ్‌ని మించిన‌వారు లేరు. కొత్తద‌నం కావాల‌ని ప్ర‌తి సినిమాకు నేర్చుకుంటూ వ‌చ్చారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే సినిమా చాలా కొత్త‌గా ఉంటుంది. ఆయ‌నేనా న‌టించింది అని నాకు డౌట్ వ‌స్తుంది. కామెడీ అద్భుతంగా చేశాడు. ఇక డాన్స్ అయితే రెచ్చిపోయాడ‌నే చెప్పాలి. మా కాంబినేష‌న్లో సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. 13 ఏళ్ల త‌ర్వాత రీఎంట్రీ మ‌హేశ్‌తో ఇవ్వ‌డం ఆనందంగా ఉంది. సినిమాల్లోనే కాదు.. నిజంగా కూడా ఆయ‌న సూప‌ర్‌స్టార్‌. వెయ్యి మంది ఆడ‌పిల్ల‌ల‌కు గుండె ఆప‌రేష‌న్స్ చేశారంటే.. మామూలు విష‌యం కాదు.. గ్రేట్ అనే చెప్పాలి. ఆయ‌న‌, ఆయ‌న భార్యా పిల్ల‌లు వందేళ్లు బావుండాల‌ని దీవిస్తున్నాను. డైరెక్ట‌ర్ అనిల్ కామెడీ సినిమాల‌తో అద్భుతంగా చూపించారు. ర‌ష్మిక చ‌క్క‌గా న‌టించింది. కొత్త ట్రెండ్ తీసుకొస్తుంద‌ని నేను భావిస్తున్నాను. ఈ పాత్ర‌కు నేను న్యాయం చేస్తాన‌నే గ‌ట్టి న‌మ్మి నాతో ఈ పాత్ర‌ను చేయించారు. నా శాయ‌శ‌క్తులా నా పాత్ర‌కు న్యాయం చేశాన‌ని అనుకుంటున్నాను. ర‌త్న‌వేలుగారు అద్భుతంగా మ‌మ్మ‌ల్ని చూపించారు. దేవిశ్రీ ప్ర‌సాద్‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. అంద‌రూ అద్భుతంగా చేశారు. జ‌న‌వ‌రి 11న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది. బోర్డ‌ర్‌లో మ‌న కోసం పోరాడుతున్న సైనికుల కోసం ఈ సినిమాను అంకిత‌మిస్తున్నాం`` అన్నారు.

 

ఇలా ఈ ఈవెంట్లో అంద‌రి గురించి మాట్లాడి కేవ‌లం ఒక్క చిరంజీవి గురించి మాత్రం ఏదో చెప్పాలి కాబ‌ట్టి చెప్పాలి అన్న‌ట్లు చివ‌ర్లో మ‌మ అన్న టైపులో రెండు ముక్క‌లు మాట్లాడి ముగించింది. దానికి చిరంజీవి చాలా ఫీల‌యిన‌ట్లు ఆయ‌న ఫేస్ ఎక్స్‌ప్రెష‌న్ కనిపించింది. ఎంతైనా విజ‌య‌శాంతి డేరింగ్ వేర‌నే చెప్పాలి. మ‌హేష్‌ను పొగ‌త్త‌ల వ‌ర్షంలో ముంచేసిన లేడీ అమితాబ్ చిరు గురించి మాత్రం స‌రిగా మాట్లాడ‌క‌పోవ‌డం ఎందుకో చాలా మందికి బాధ‌క‌లిగించింది. కానీ చిరు మాత్రం త‌న వంతు వ‌చ్చిన‌ప్పుడు విజ‌య‌శాంతి గురించి చాలా సేపుమాట్లాడారు ఆమెను ఆప్యాయంగా ద‌గ్గ‌ర‌కు కూడా తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: