సూపర్ స్టార్ మహేష్ బాబు సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తూ దూసుకుపోతోంది. ఎంతో మంది ప్రముఖులు ఫ్రీ రిలీజ్ ఈవెంట్  కు  విచ్చేశారు. ఇక ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి తో తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయశాంతి... సరిలేరు నీకెవ్వరు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు

 

 

 లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఆ బిడ్డ బంగారం చూడడానికి ఎంతో క్యూట్ గా ఉంటాడు పట్టుకుంటే కందిపోయే లా ఉంటాడు 24 క్యారెట్ల గోల్డ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే మహేష్ బాబు  జెంటిల్మెన్ అంటూ విజయశాంతి మహేష్ బాబు పై పొగడ్తల వర్షం కురిపించారు. మహేష్ బాబు అన్ని పొగడ్తలకు అర్హుడే అంటూ విజయశాంతి ప్రశంసించారు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలనే అంశాన్ని మహేష్ బాబును చూసి నేర్చుకోవచ్చని విజయశాంతి తెలిపారు. ఎంత ఎదిగినా నిరాడంబరంగా ఉండే హీరో మహేష్ బాబు అని తెలిపారు విజయశాంతి. 

 

 

 

 ఈ సినిమాలో కామెడీ డాన్స్ లలో  నమ్మశక్యం కాని విధంగా మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు విజయశాంతి. తాను సూపర్ స్టార్ కృష్ణ సినిమా ద్వారా ఆనాడు  తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాను అని...  ఇప్పుడు ఆయన తనయుడు మహేష్ బాబు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. మహేష్ బాబు హీరో గానే కాకుండా ఒక మంచి మనిషిగా సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటారని ప్రశంసించారు విజయశాంతి. వందల  మంది గుండె ఆపరేషన్లు చేయించడం మామూలు విషయం కాదని మహేష్ బాబు ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు అంటూ విజయశాంతి తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ గురించి చెబుతూ ఆయనతో తాను చేసిన సినిమాలన్నీ ఈ సందర్భంగా గుర్తుకు వస్తున్నాయ్ అని విజయశాంతి చెప్పుకొచ్చారు. ఈ సినిమా హిట్ అవ్వాలని ఆశీర్వదించేందుకు వచ్చినా మెగాస్టార్ చిరంజీవి కి ధన్యవాదాలు అంటూ ప్రసంగాన్ని ముగించారు విజయశాంతి.

మరింత సమాచారం తెలుసుకోండి: