ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎంత ఓపెన్‌గా ఉంటున్నారో అంతే ఓపెన్‌గా మాట్లాడేస్తున్నారు. సహజీవనం, పెళ్ళికి ముందు గర్భం లాంటి వాటినైతే లైట్ తీసుకుంటున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్స్‌కైతే ఇవి మరీ లైట్. అయితే తాజాగా తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ల గర్భవతి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

 

కారణం.. ఆమెకు ఇంకా పెళ్ళికాలేదు.. కానీ గర్భవతి అయ్యింది. అలా ఉన్న ఫోటోలు తీసుకొచ్చి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏంటి ? గర్భవతా ? నిన్నటివరకు బనే ఉన్నావుగా అప్పుడే ఇంత పొట్ట ఎలా మేడం అంటూ ఆమెను కామెంట్లతో ప్రశ్నలు అడిగారు. 

 

అవును.. కామెంట్లతోనే అడిగారు.. కానీ వారు బయపడినట్టు ఆమె ఎం గర్భవతి అవ్వలేదు.. ఒక వెబ్ సిరీస్ లో పాత్రలో భాగంగా ఆమె గర్భవతి అయినట్టు ఫోటోలు తీసుకుంది. అవి కాస్త సోషల్ మీడియాలో పెట్టింది. అయితే నిజానికి ఆ ఫోటోలలో శోభిత నిజంగా గర్భవతి అయినట్టు కనిపించింది. నిజంగానే అయ్యింది ఏమో అనుకునే అంత సహజంగా ఆ ఫోటోలు ఉన్నాయి. 

 

కాగా తెలుగమ్మాయి అయిన శోభిత దూళిపాళ్ల అడివి శేష్ గూఢచారి సినిమాలో హీరోయిన్ గా నటించి అందరిని ఆకట్టుకుంది. ఆలా ఆకట్టుకున్న ఈ శోభిత ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కీలక పాత్రలలో నటిస్తూ అందరిని మెప్పిస్తుంది. ఇప్పటికే ''మేడ్ ఇన్ హెవెన్'' సిరీస్ లో నటించి మంచి పేరుతో పాటు పాపులారిటీ కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా ఘోస్ట్ సిరీస్ లో ఆమె నటిస్తుంది. ఇంకా సినిమాలలో అయితే మలయాళ సినిమా ''కురూప్''లో కథనాయక పాత్రలో మెరవగా హిందీలో అక్షయ్ కుమార్ సినిమా ‘లక్ష్మి బాంబ్’ లో కీలక పాత్రలో నటిస్తుంది. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

A day in the life of neha September, 1995 Southall, london Colour photos @anuragkashyap10 @ishaluthra26 @sinbadphgura

A post shared by Sobhita Dhulipala (@sobhitad) on

మరింత సమాచారం తెలుసుకోండి: