‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసి పోవడంతో ఇక అందరి దృష్టి ఈరోజు సాయంత్రం జరగబోతున్న ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై అందరి దృష్టి ఉంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈరోజు జరగబోతున్న ఈవెంట్ లో అల్లు అర్జున్ ‘రాములో రాముల’ పాటలోని ‘హాఫ్ కోట్ డ్యాన్స్’ బిట్ ను స్టేజ్ పై లైవ్ గా పెర్ఫామ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే అన్ని పాటలు పాపులర్ అయిన నేపధ్యంలో తమన్ ఆద్వర్యంలో జరగబోతున్న మ్యూజికల్ ఫెస్టివల్ లైవ్ లో వేదిక మీద బన్నీ డ్యాన్స్ చేయబోతున్నాడు అన్న లీకులు వస్తున్నాయి. ఈరోజు జరగబోయే ఈవెంట్ తో భారీ ప్రమోషన్ మొదలు పెట్టిన బన్నీ ఈ నెల 10 దుబాయ్ లో ఈసినిమా కోసం ఒక ఈవెంట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. 

అయితే ఈలోపునే విశాఖపట్నంలో ఈ సినిమా ప్రమోషన్ కు సంబంధించిన మరొక ఫంక్షన్ జరగవలసి ఉన్న నేపధ్యంలో ఈమూవీ విడుదల అయ్యాక దుబాయ్ ఫంక్షన్ పెట్టుకుంటే బాగుంటుందా లేదంటే ముందుగానే పెట్టుకొవాల అన్న కన్ఫ్యూజన్ లో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఈరోజు జరగబోతున్న ఈవెంట్ లో తమన్ లైవ్ షోలో సిద్దూ శ్రీరామ్ తో పాటు అనేకమంది ప్రముఖ సింగర్స్ పాల్గొంటున్నా బన్నీ స్టేజ్ పై చేయబోయే డాన్స్ మాత్రమే హైలెట్ కాబోతోంది. 

నిన్న జరిగిన ‘సరిలేరు’ ఫంక్షన్ స్థాయికి మించి అత్యంత భారీ ఏర్పాట్లతో ఈరోజు హైదరాబాద్ లోని పోలీసు గ్రౌండ్స్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ కు అత్యధిక సంఖ్యలో అభిమానులు వచ్చేలా చేసి ‘సరిలేరు’ ఈవెంట్ కన్నా తమ ఈవెంట్ మరింత సక్సస్ అయింది అన్న సంకేతాలు ఇస్తూ ఇప్పటికే ఆడియో పరంగా కొనసాగుతున్న తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మరింత పట్టు పెంచుకోవడానికి ‘సరిలేరు’ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: