సినిమాలు తీసే ప్రతి దర్శకుడికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ తోనే తనకో మార్క్ ఏర్పరచుకుంటాడు. అటువంటి మార్క్ తోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు రాణించారు.. సక్సెస్ ఫుల్ దర్శకులుగా ఎదిగారు. మాస్, క్లాస్, కామెడీ, సెంటిమెంట్, సమస్యలు, ఉద్యమాలు, ఆర్ట్.. ఇలా ఏ జోనర్ తీసుకున్నా అందులో నిష్ణాతులు ఉన్నారు మన తెలుగు సినీ పరిశ్రమలో. ఇప్పుడు అటువంటి ఓ ప్రత్యేక జోనర్ లోనే వెళ్తున్నాడు అనిల్ రావిపూడి. తీసిన నాలుగు సినిమాల్లో కామెడీకి పెద్ద పీట వేస్తూ టాలీవుడ్ లో తన మార్క్ చూపిస్తున్నాడు.

 

 

సరిలేరు నీకెవ్వరు సినిమా ట్రైలర్ చూస్తే ఇదే అర్ధమవుతోంది. ‘నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్, అబ్బబ్బబ్బబ్బా.., సంగీత అండ్ టీమ్ డైలాగ్ డిక్షన్’ ఇవన్నీ చూస్తే తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడనే అర్ధమవుతోంది. ఎఫ్2 సినిమాను చూసిన ఎవరికైనా నిన్నటి సరిలేరు నీకెవ్వరు సినిమా ట్రైలర్ చూస్తే ఇదే అర్ధమవక మానదు. ఎఫ్2లో కూడా వెంకటేశ్, వరుణ్ తేజ్, వైవిజయ, అన్నపూర్ణ.. ఇలా వాళ్ల మధ్య వచ్చిన డైలాగ్ డిక్షన్ లాంటిదే సరిలేరు.. లోనూ ఫాలో అయ్యాడని అర్ధమవుతోంది. ఎఫ్2 హిట్ లో ఫ్యామిలీ కంటెంట్ కంటే దాని మధ్యలో పండించిన ఈ కామెడీకే ఎక్కువ మార్కులు పడ్డాయి.

 

 

సరిలేరు నీకెవ్వరులోనూ అనిల్ ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడనిపిస్తోంది. అయితే ఎఫ్2లో వెంకటేశ్ నుంచి రెడీమేడ్ కామెడీని రాబట్టుకోవచ్చు. మహేశ్ కామెడీ చేయడంలో కొంత వీక్. అనిల్ ఈ సినిమాతో మహేశ్ నుంచి ఇదే రాబట్టడానికి ప్రయత్నించాడు. అందుకే సంగీత బ్యాచ్ ట్రైన్ సీన్ లో మహేశ్ చేత కూడా అబ్బబ్బబ్బబ్బా.. అంటూ కామెడీ చేయిస్తున్నాడు. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో తెర మీదే చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: