దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ఫై దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం పిరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నటించగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి  ఒలివియా మోరిస్‌ నటిస్తోంది. ఇదిలా ఉంటే.. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. 

 

తెలంగాణ యాసలో మాట్లాడుతూ సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా తరవాత రాహుల్‌కు వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం బిజీగా ఉన్న యువ కమెడియన్స్‌లో రాహుల్ ఒకరు. అయితే మంచి కామెడీ టైమింగ్‌తో అదరగొడుతోన్న రాహుల్ రామకృష్ణకు అదిరిపోయే అవకాశం వచ్చింది. అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వ‌స్తున్న‌ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాహుల్ నటించనున్నాడు. ఈ సినిమాలో రాహుల్.. కొమరం భీమ్‌ పాత్రలో నటిస్తోన్న ఎన్టీఆర్‌కి దోస్త్‌గా నటించబోతున్నట్లు సమాచారం. 

 

అలాగే ఈ సినిమాలో రామకృష్ణది కీలక పాత్ర కానుంద‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో జాయిన్ అవ్వబోతున్నాడు రామ‌కృష్ణ‌. ఇక‌ ఇతర ముఖ్య పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అయితే ఇద్దరు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు,కొమురం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, ఈ సినిమాలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమరం భీంగా నటిస్తున్నారు. మ‌రియు ఈ సినిమా జులై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎటువంటి అప్‌డేట్ బ‌య‌ట‌కు రాకుండా షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నాడు రాజ‌మౌళి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: