టాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్లుగా వచ్చినా.. సరైన అవకాశాలు, అదృష్టం కలిసి రాక సెకండ్ హీరోయిన్ గా మిగిలిపోతుంటారు.  మరికొంత తమ కెరీర్ కొనసాగించే ప్రయత్నంలో ఐటమ్ సాంగ్స్ తో కాంప్రమైజ్ అవుతుంటారు.  అల్లు అర్జున్ కెరీర్ లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్య 2’ మూవీలో నటించిన శ్రద్దా దాస్ సెకండ్ హీరోయిన్ గా మెప్పించింది.  కాకపోతే ఈ మూవీలో ఆ హాట్ బ్యూటీకి పెద్దగా పేరు రాలేదు. తర్వాత బాలీవుడ్ లో కొన్ని బోల్డ్ సినిమాల్లో నటించిన అక్కడ కూడా పెద్దగా రాణించలేకపోయింది.  మంచి అభినయం, అందం కలిగి ఉన్న ఈమెకు తెలుగులో తన నటన నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాక తెలుగు సినీ పరిశ్రమలో తన ఉనికిని చాటుకునేందుకు తెగ కష్టపడిపోతుంది శ్రద్దాదాస్. తాజాగా ఈ అమ్మడికి తెలుగులో ఓ అవకాశం దక్కింది.

 

ఒకప్పుడు టాలీవుడ్ అందగాడు.. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు ‘లెజెండ్’ మూవీ తర్వాత విలన్ అవతారం ఎత్తారు.  హీరోగా బిజీ కాకపోయినా.. ఇప్పుడు పలు భాషల్లో విలన్ గా మంచి హిట్స్ అందుకుంటున్నాడు. తాజాగా డాన్స్ మాస్టర్ విద్యాసాగర్ జగపతి బాబుతో ఓ బోల్డ్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఇందులో జగపతి బాబు కండోమ్ లు తయారు చేసే కంపెనీ అధిపతి గా కనిపించనున్నాడుట. అయితే తన కండోమ్స్ ప్రమోట్ కోసం ఓ వేశ్యను సంప్రదించడం.. తర్వాత ఆమె ప్రేమలో పడిపోవడం జరుగుతుందట. ఇందులో వేశ్య పాత్ర లో బోల్డ్ బ్యూటీ శ్రద్దా దాస్ నటించబోతున్నట్లు సమాచారం.

 

జగపతిబాబు ప్రేమలో పడేది ఈ భామతోనే. ఈ ప్రేమ కథ చాలా ఎమోషనల్ గా సాగుతుందిట. ఇప్పటికే ఈ మూవీలోని పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ ముఖ్య మరో విభిన్నమైన పాత్రలో నటించేందుకు అవకాశం తలుపు తట్టినట్లు తెలుస్తోంది. జగపతిబాబు నటిస్తున్న ఓ మూవీలో ఈ శ్రద్దాదాస్ వేశ్య పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఈ హాట్ బ్యూటీకి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: