చాన్నాళ్ల తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగింది. గత ఏడాది జూలై 18 వ తారీఖున విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా పూరి జగన్నాథ్ మరియు రామ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు అతి తక్కువ సమయంలోనే రాబట్టిన సినిమాగా ఇద్దరి కెరియర్లో హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే సినిమాలో రామ్ పక్కన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించడం జరిగింది. సినిమా భారీ స్థాయిలో విజయం సాధించడంతో నిధి అగర్వాల్ కి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో అంతకుముందు చేసిన సినిమాల విషయంలో చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న నిధి అగర్వాల్ తాజాగా ఒక్కసారిగా తన రెమ్యునరేషన్ పెంచేసింది మూడురెట్లు అనేది ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

 

అయితే ఇటువంటి తరుణంలో టాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వర్ష పెట్టి సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్ ఇటీవల ఒక ఖరీదైన కారు కొనుగోలు చేయడం జరిగింది. దీంతో ఆ కార్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో చాలామంది నిధి అగర్వాల్ అభిమానులు సోషల్ మీడియాలో నెటిజన్లు అతి తక్కువ టైమ్ లోనే అత్యంత ఖరీదైన కార్ కొన్నావా నిధి అగర్వాల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

ఇదే తరుణంలో తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తూ హలో బ్యూటీ నీకు ఈ శతాబ్దంలో కి స్వాగతం అని కామెంట్ చేస్తూ ఆ కొత్త కార్ యొక్క వీడియోని షేర్ చేసింది. దీంతో ఇండస్ట్రీలో ఉన్న చాలామంది కూడా అతి తక్కువ టైమ్ లోనే నిధి అగర్వాల్ టైం మారిపోయిందని 'ఇస్మార్ట్ శంకర్' సినిమా టైం మార్చేసిందని నిధి అగర్వాల్ కి వచ్చిన ఈ టైం చివరిదాకా నిలబెట్టుకుంటే బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: