జగపతి బాబు లెజెండ్ సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. క్షణం ఖాలీ లేకుండా ప్రతి నాయకుడి గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగానే ఉంటున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలకు తెలుగు విలన్లు లేరు అన్న కొరతను చాలా వరకూ తీర్చగలిగాడు. అంతేకాదు దాదాపుగా ప్రకాష్ రాజ్ ని రీ ప్లేస్ చేశాడని చెప్పొచ్చు. అయితే హీరో వేషాలు వదిలేయడం లేదు. అవకాశం వస్తే హీరోగా చేయడానికి సిద్దమవుతూ సంతకం చేస్తున్నాడు. తాజాగా ఓ బోల్డ్ మూవీలో మెయిన్ లీడ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తాజా సమాచారం.

 

డాన్స్ మాస్టర్ విద్యాసాగర్ జగపతి బాబుతో ఓ బోల్డ్ మూవీని తెరకెక్కించబోతున్నాడట. ఈ సినిమాలో జగపతి బాబు కండోమ్ లు తయారు చేసే కంపెనీకి ఓనర్ గా కనిపించనున్నాడట. వేశ్యల తో మాత్రమే తన కంపెనీ కి సంబంధించిన ప్రకటనలు రూపొందిస్తాడట. ఆ క్రమంలోనే అతడు ఓ వేశ్య తో ప్రేమలో పడతాడట. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య ప్రయాణం ఎలా సాగిందన్నదే సినిమా అని అంటున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వేశ్య పాత్ర లో బోల్డ్ బ్యూటీ శ్రద్దా దాస్ నటించనుందట. జగ్గు భాయ్ ప్రేమలో పడేది కూడా ఈ బ్యూటీనేనట. అంతేకాదు ఈ ప్రేమ కథ చాలా ఎమోషనల్ గాను సాగుతుందిట.

 

ఇక జగపతి బాబు కు ఇది ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న జగపతి విలన్ గాను ఐడెంటీని నిలుపుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో వేశ్యతో ప్రేమలో పడే కండోమ్ కంపెనీ అధిపతి రోల్ అంటే కచ్చితం గా సాహసమనే అందరు అంటున్నారు. గతంలో ఇలాంటి సాహసమే సీనియర్ నరేష్ ఓసారి చేసాడు. నిత్యామీనన్ ప్రధాన పాత్ర పోషించిన 'ఘటన' అనే సినిమాలో ఉమనైజర్ పాత్రలో నటించాడు. ఎప్పుడూ పాజటివ్ గా.. స్టాప్ పాత్రల్లో కనిపించే సరేష్ మొదటిసారి తెరపై నెగిటివ్ షేడ్ ని టచ్ చేయడంతో ప్రశంసలతో పాటు విమర్శలొచ్చాయి. ఇప్పుడు జగ్గూభాయ్ అలాంటి ప్రయోగాలే చేస్తున్నాడు. మరి ఈ ప్రయోగాన్ని జనాలు ఎంతవరకు మెచ్చుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: