నిధి అగర్వాల్.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ మధ్యకాలంలో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి బాగా పాపులర్ అయింది నిధి అగర్వాల్. ఈ సినిమా తరువాత ఆమెకు సినీ ఆఫర్స్ తో పాటు షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా బాగా వస్తున్నాయి. మొన్న ఆ మధ్య కూడా రాజమహేంద్రవరంలో కోటగుమ్మం సెంటర్లో నూతన షాపింగ్ మాల్ ను ఓపెన్ చేసింది ఈమె. అప్పుడు ఆమెకోసం వచ్చిన అభిమానుల సంఖ్య చూస్తే ఆమె క్రేజ్ తారా స్థాయికి చేరుకుందని ఇట్టే అర్థమైపోతుంది. అయితే, అభిమానుల ఫాలోయింగ్ తో పాటు ఆమె బ్యాంకు అకౌంట్ లో కాష్ కూడా నిరంతరాయంగా పెరుగుతుందని ఆమె ఇటీవల కొన్న ఖరీదైన కారు చూస్తే అర్ధమవుతుంది.


విషయానికి వస్తే, ప్రస్తుతం నిధి అగర్వాల్ కొన్నటువంటి పోర్స్చే మకాన్ కారు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. కేవలం నాలుగు సినిమాలు తీసిన నిధి అగర్వాల్ దాదాపు రూ.90 లక్షలు ఖరీదు చేసే ఈ పోర్స్చే కారుని కొన్నదంటే ఎన్ని డబ్బులు సంపాదిస్తుందో ఆమె అంటూ ఆశ్చర్యపోతూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఆమె క్రేజ్ ఫుల్గా పెరగడంతో... తన రాబోయే సినిమాల కోసం భారీ పారితోషికం డిమాండ్ చేస్తోందట. ఇంతకు ముందు కంటే మూడు రెట్లు అధికంగా తన పారితోషికాన్ని పెంచినట్లు సమాచారం. సో, ఇస్మార్ట్ శంకర్ చిత్రం తన సినీ కెరీర్ లో పెద్ద ప్లస్ గా అని చెప్పుకోవచ్చు.


ఆమె వర్క్ ఫ్రంట్ చూసుకుంటే, ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీస్ లో కలిపి 3 సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇందులోని ఒక సినిమాకు అక్షరాలా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు సమాచారం. అటు సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ, ఇటు పబ్లిక్ మీటింగ్స్ లలో పాల్గొంటూ తన అందచందాలతో అభిమానులను బాగా అలరిస్తుంది ఈ ఇస్మార్ట్ పిల్ల. 

 

https://www.instagram.com/p/B665gEvBq5f/?utm_source=ig_web_copy_link

మరింత సమాచారం తెలుసుకోండి: