ఈటీవీ లో గత ఏడు సంవత్సరాలుగా దూసుకుపోతున్న కామెడీ షో జబర్దస్త్. ఈ హాస్యభరిత షో కొన్ని వందల మంది కళాకారులకు జీవనాధారం అయ్యింది. అలాగే, ఈ కామెడీ షో టీం లీడర్లైనా ప్రముఖ హాస్యనటులు సినీ హీరోల అంతగా క్రేజ్ ను కూడా సంపాదించారు. దాంట్లో చమ్మక్ చంద్ర ఒక్కడని నిర్మొహమాటంగా చెప్పుకోవచ్చు. అతను చేసే స్కిట్లలో చాలా తక్కువగా డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. అతని స్కిట్లు ఫ్యామిలీ కోసమే ప్రత్యేకంగా చేసినట్లు అనిపిస్తుంది.

 

 

ఈ కారణంగానే, హాస్య నటి అయిన ఒక అమ్మాయి గత 5 ఏళ్లగా అతని పక్కనే ఏ బిడియం లేకుండా నటిస్తోంది. అయితే, ఈ అమ్మాయి పేరు గానీ ఆమె బయోగ్రఫీ కానీ చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె రెండు హిట్ సినిమాల్లో కూడా నటించినా, అంతగా గుర్తుంపు రాలేదు కానీ జబర్దస్త్ ద్వారా తెలుగు అభిమానులందరి మనసులో మంచి ప్లేస్ ను ఏర్పరచుకుంది.

 


ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటంటే... సత్య శ్రీ. మొన్నటివరకు చమ్మక్ చంద్ర తో కలిసి జబర్దస్త్ స్కిట్ లలో నటించారు ఈమె. అయితే, చమ్మక్ చంద్ర ఇటీవల జీ తెలుగులో ప్రసారమవుతున్న అదిరింది షో కు వెళ్లిపోవడంతో ఆమె కూడా చంద్రతో పాటే జీ తెలుగుకు మకాం మార్చింది.

 

అయితే, 10రోజుల క్రితం చమ్మక్ చంద్ర చేసిన స్కిట్ లో భాగంగా నాగబాబు ఆమెను కత్తిలా ఉందని అన్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అప్పుడే, ఆమె గురించి బాగా వార్తలు వచ్చాయి. అలాగే ఆమె పేరు తెలుసుకోవాలని చాలా మంది తపన కూడా పడ్డారు. ఎట్టకేలకు, ఇప్పుడు ఆమె పేరు తో సహా తాను రాజా ది గ్రేట్, ఆర్‌డిఎక్స్ లవ్ చిత్రాలలో నటించిందని తెలిసిపోయింది. అయితే, ఆర్‌డిఎక్స్ లవ్ చిత్రంలో ఆమె హీరోయిన్ స్నేహితురాలిగా నటించింది. ఆమె గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకునే వారు సత్య శ్రీ అఫీషియల్ అనే ఇంస్టాగ్రామ్ ఖాతాను వీక్షించవచ్చు.


https://www.instagram.com/p/B6XYXwJFIQp/?igshid=90dao18kxfwp


మరింత సమాచారం తెలుసుకోండి: