‘నాపేరు సూర్య..’ లాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పిన ‘అల వైకుంఠపురం లో’ సినిమా కథ బన్నీ ఓకే చేయడం జరిగింది.  హైదరాబాద్ నగరం యూసఫ్ గూడ ప్రాంతంలో పోలీస్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ సినిమా యొక్క మ్యూజికల్ కన్సర్ట్ కి మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు భారీ స్థాయిలో రావటంతో డైరెక్టర్ త్రివిక్రమ్ పులకరించిపోయారు. సినిమా పాటలు సోషల్ మీడియాలో రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేసి ఈ సినిమాపై మంచి హైప్ తీసుకువచ్చినట్లు త్రివిక్రమ్ ఈ సందర్భంగా భావించినట్లు సమాచారం.

 

జరుగుతున్న ఈ 'అల వైకుంఠ పురం లో' మ్యూజికల్ కన్సర్ట్ కి సినిమా యొక్క సాంగ్స్ పోలీస్ స్టేడియం లో ఉన్న అభిమానులు గ్యాలరీల గోడలపై డాన్సులు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. మంచి రెస్పాన్స్ గ్రౌండ్ లో ఉండటంతో సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. ముఖ్యంగా గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని….మళ్లీ బన్నీ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని బన్నీ అభిమానులు కోరుకుంటున్నారు.

 

ముఖ్యంగా ఓ మై గాడ్ డాడీ అదేవిధంగా సామజవరగమన పాటలకి యూసఫ్ గూడా లో పోలీస్ గ్రౌండ్ లో అభిమానుల మధ్య దద్దరిల్లే వాతావరణం నెలకొంది. సాంగ్స్ విని చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈవెంట్ కి వచ్చిన వాళ్ళు. ముఖ్యంగా సాంగ్ చూస్తున్నంత సేపు అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు ఫోటోలు స్క్రీన్ పై చూసి అభిమానుల గోల గోల చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా పై ఇండస్ట్రీలో కూడా అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే సంక్రాంతికి బన్నీ హిట్ ట్రాక్ ఎక్కడం గ్యారెంటీ అనే టాక్ వినపడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: