ఈ మధ్య ఎక్కడ చూసిన ఫ్రెంచ్ భాష నుండో లేక హాలీవుడ్ నుండి లైనో తెచ్చేయడం అది మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చేసి మా కథ అని మొదలెట్టేస్తారు. అంతే సరిగ్గా నెల తిరిగేసరికి సరుకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిపోతుంది. దాంతో నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టేస్తారు. ఇపుడు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఒక సినిమా బాగోతం ఇలానే ఉందని నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. ఆ సినిమాలో హీరో ఒక రైటర్. పెన్ను తో పేపరుపై కథ రాయడం మొదలు పెడతాడుట. ఆ  కథలో హీరో విజయ్ దేవరకోండ. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. అలా కథ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో కథ రాస్తున్న హీరోకి  మరో థాట్ వచ్చి  అంతవరకూ రాసిన కథను రఫ్ చేసేస్తాడు.

 

మళ్లీ కొత్త కథ ప్రారంభిస్తాడు. ఈసారి కూడా కొత్త కథలో హీరో దేవరకొండనే. కానీ హీరోయిన్ మాత్రం మారుతుంది. ఐశ్యర్య  స్థానంలో క్యాథరీన్ థ్రెసా వస్తుంది. ఇంతకీ ఈ కథ రాస్తోంది ఎవరో తెలుసా? అదీ కూడా విజయ్ దేవరకొండనే. ఇంట్రెస్టింగ్ కదూ? వింటుంటేనే ఉత్కంఠ పెరుగుతోంది. మరి తెరపై ఎలా కనిపిస్తోందో కానీ వరల్డ్ ఫేమస్ లవర్ థీమ్ ఇప్పటికే వైరల్ అయిపోతోంది. ఇది కేవలం నాలుగు కోట్ల తో తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ స్టోరీ అని ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతోంది. 

 

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓ ప్రెంచ్ సినిమాకి ప్రీమేక్ అనే మరో ప్రచారం కూడా మొదలైంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాదు గానీ .. ఈ వార్త మాత్రం సోషల్ మీడియాతో సహా..రౌడీ స్టార్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే కథ అయితే దానికి దర్శకుడు క్రాంతి మాధవ్ తనదైన సెన్సిబిలిటీస్ కమర్శియాలిటీని యాడ్ చేసి సినిమా తీసి ఉంటాడని ఫిక్సైపోవచ్చు. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ కి కాస్త నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అర్జున్ రెడ్డి తర్వాత కూడా విజయ్ ఇంకా అదే మూడ్ లో ఉన్నాడని ట్రోల్ చేస్తున్నారు.

 

వరల్డ్ ఫేమస్ లవర్ కోసం హీరోయిన్ల విషయంలో బాగా బోల్డ్ నెస్ ఎక్కువేనని అనిపిస్తోంది. నలుగురు హీరోయిన్స్ తో విజయ్ రొమాన్స్ పీక్స్ లోనే ఉందని ఇప్పటికే అర్థమైఓయింది. ఇక ఈ సినిమాలో గ్లామర్ ఎలివేషన్ కి అర్జున్ రెడ్డి మాదిరిగా స్కోప్ ఎక్కువగానే ఉందట. అందుకే హీరోయిన్ల తో విపరీతంగా గ్లామర్ ని ఒలికించారనే ప్రచారం సాగుతోంది. మరి లీకైన స్టోరీ ఎంతవరకూ నిజం? రౌడీ స్టార్ రొమాంటిక్ కథ ఏమిటో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఇప్పటికే షూటింగ్ కంలీట్ చేసుకున్న ఈ ఫిబ్రవరి 14 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: