సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక మందాన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి ని పొగడ్తలతో చెట్టెకించింది. చిరు సార్, ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్ కూడా ఇచ్చేసింది ఈ కన్నడ భామ. అయితే, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి కూడా ఆమెను బాగానే కొనియాడారు కానీ ఆమె పేరును మాత్రం సరిగా ఉచ్ఛరించలేకపోయాడు. ఆ రకంగా చిరు అన్నప్పుడు.. రష్మిక..'ఏంటీ నా గురించేనా చిరు సార్ మాట్లాడేది', అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చిసేంది.

https://mobile.twitter.com/ntr_jay/status/1213888451126255616


ఇంతకీ చిరంజీవి రష్మిక మందానని ఉద్దేశిస్తూ ఏమ్మన్నారంటే...'రష్ మీ మండూక.. తను ఈ సినిమాల్లో చాలా చక్కగా నటించిందని ట్రైలర్ చూస్తే నాకు అనిపిస్తుంది. ఇంకా, రష్ మీ మండూక నన్ను కాంట్రాక్టు తీసుకుందేమోనని అనిపిస్తుంది. ఛలో సినిమాలో తను ఉంది.. నన్ను ఎవరో పిలిస్తే అక్కడికి వెళితే.. అక్కడే తనే హీరోయిన్. ఆ తరువాత రాధా... ఆహ్ గీత గోవిందం సినిమా. అదేదో మా వాళ్ళది కదా.. (గీతా ఆర్ట్స్)అని వెళితే అక్కడా ఈ అమ్మాయే. చాలా రోజుల తరువాత అనుకోకుండా ఇక్కడికి వస్తే మళ్ళీ ఈ అమ్మాయే. ఏవేమ్మా నన్ను ఏమైనా కాంట్రాక్టు తీసుకున్నావా?' అంటూ చమత్కరించారు చిరంజీవి.

https://mobile.twitter.com/HanuNews/status/1213880477985067008


అయితే, తన పేరుని సరిగా పలకకపోయినా.. ఏదో టంగ్ స్లిప్ అయ్యారేమోనని రష్మిక లైట్ గా తీసుకున్న... నెటిజన్లు మాత్రం చిరంజీవిని రష్ మీ మండూక ఏంది స్వామి అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో చీర చిరంజీవిని మించిన కమెడియన్ లేడని వెటకారం ఆడుతున్నారు. అయితే, ఈ ఒక్క విషయం పక్కన పెడితే చిరు సార్ స్పీచ్ అద్భుతంగా ఉందని నెటిజన్లు పొగుడుతున్నారు. మరోవైపు, మహేష్ బాబు ఒక సందర్భంలో టంగ్ స్లిప్ అవ్వడంతో అతన్ని కూడా ఎద్దేవా చేస్తున్నారు. 

https://mobile.twitter.com/NTRBlood/status/1213765955420999680

మరింత సమాచారం తెలుసుకోండి: