చిరంజీవి అంటే అభిమానులకూ అప్పుడు, ఇప్పుడు ఎనలేని అభిమానం అని ఎప్పటికప్పుడు నిరూపించబడుతుంది. ఆయన రాజకీయాలు అంటూ తిరిగిన, మళ్లీ సినిమాలు అంటూ వచ్చినా చిరుకున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఇకపోతే తెలుగు చిత్రసీమను రెండున్నర దశాబ్దాలపాటు  ఏలిన వెండితెర రారాజుగా వెలుగొందుతున్నాడు చిరు.

 

 

ఇక చిరంజీవి రాజకీయాలవైపు 9 ఏళ్ల పాటు వెళ్లడం మూలానా సినిమా పరిశ్రమకు దూరమయ్యాడు. తిరిగి సిల్వర్ స్రీన్‌కు రీ ఎంట్రీని ఖైది నెం150 తో ఇచ్చిన చిరు బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. అప్పుడు ఇప్పుడు కూడా చిరులో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఇకపోతే  ఈ మద్య కాలంలో సినిమా ఇండస్ట్రీ లో తరచుగా కొన్ని కొన్ని వివాదాలు సంభవిస్తున్నాయి. దాసరి గారు బ్రతికున్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్లిన వారు. ఆయన మరణించిన అనంతరం సినిమా ఇండస్ట్రీకి పెద్దను కోల్పోయిన లోటు కలిగిస్తుంది. ఇక ఇప్పటి వరకు ఆ లోటును ఎవరు భర్తి చేయలేక పోయారు.

 

 

అయితే తాజాగా జరిగిన కొన్ని పరిణామాలను చూస్తుంటే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అందరివాడయ్యారన్న అనుమానం కలుగుతుందట. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్దన్నలా మారాడనే వార్త చిన్న చిన్నగా బయటకు వస్తుంది. ఇలా ఎందుకంటే ఈ మద్యకాలంలో పరిశ్రమలో చిన్న, చిన్న సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు, చిన్న సినిమాలకు ఎంకరేజ్ చేసేందుకు, తెలుగు మూవీస్‌ను ముందుకు నడిపించేందుకు ఓ వ్యక్తి కావాల్సి వచ్చింది ..

 

 

సరిగ్గా ఇదే సమయంలో మెగాస్టార్. రాజకీయాలను పూర్తిగా పక్కనబెట్టడంతో..ఆయన మనసు పూర్తిగా సినిమాలకు అంకితమైంది. చిన్న హీరోలు ఆడియో ఫంక్షన్స్‌కు ముఖ్య అతిధిగా వెళ్లి, ఆయా సినిమాలను ఆదరించాలని కోరుతున్నారు చిరు. అంతేకాదు ‘మా’.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఏమైనా సమస్యలు ఉంటే చక్కదిద్దుతున్నారు. ఇటీవల ‘మా’ 2020 ఈవెంట్‌లో పాల్గొన్న చిరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నతి కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో చర్చించినట్టు తెలిపారు.

 

 

మరోవైపు తన, మన బేధాలు లేకుండా.. కేవలం మెగా హీరోలు చిత్రాలకు మాత్రమే కాకుండా అందరి హీరోల సినిమాలు హిట్స్  చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా మహేశ్ నటించిన చిత్రం సరిలేడు నీకెవ్వరు సినిమాకు అతిథిగా రావడం ఆయన గొప్పతనమేనంటున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు. ఏది ఏమైనా టాలీవుడ్‌కు మెగాస్టార్ ప్రజంట్ పెద్దన్నలా మారడన్నది చాలామంది వాదన. 

మరింత సమాచారం తెలుసుకోండి: