తమిళ నటుడు సూర్య ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరో సూర్య దీంతో హీరో సూర్య సినిమా వస్తుంది అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తారు. తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి విజయాలను అందుకున్నారు సూర్య. సూర్య నుండి ఏ సినిమా వచ్చిన తెలుగు ప్రేక్షకులు తెలుగు హీరోలను  ఆదరించినట్లు గానే  సూర్య సినిమాలను కూడా ఆదరిస్తూ ఉంటారు. సూర్య కూడా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ అదిరిపోయే యాక్షన్ తో ప్రేక్షకులను  సాటిస్ఫై చేస్తూ ఉంటారు. అయితే కేవలం సినిమాల ద్వారానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటారు సూర్య. 

 

 

 ఇక వరుస సినిమాలతో దూసుకుపోతూ తెలుగు తమిళ ప్రేక్షకులను అలరిస్తూ తనదైన సత్తా చాటుతున్నారు సూర్య. ఇక సూర్య పవర్ఫుల్ నటనకు ప్రేక్షకులు అందరూ ఫిదా అవ్వాల్సిందే. అయితే సినిమాలలో హీరోలుగా నటించే వాళ్ళు నిజజీవితంలో హీరోలుగా చాలా తక్కువ మందే ఉంటారు.అలాంటి వారిలో  సూర్య ఒక్కరు అనే చెప్పాలి. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఎంతోమందికి చేయూతగా నిలుస్తున్నారు హీరో సూర్య. తాను సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పేదలకు కేటాయిస్తూ ఎంతోమంది పేద పిల్లలు చదువుకునేందుకు తోడ్పాటు అందిస్తున్నారు సూర్య. దీంతో రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు సూర్య. 

 

 

 హీరో సూర్య అగరం స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి ఈ సంస్థ ద్వారా ఎన్నో సామాజిక స్వచ్చంద  కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇటీవలే ఈ సంస్థకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు హీరో సూర్య. అయితే ఈ కార్యక్రమంలో అగరం ఫౌండేషన్ నుంచి సహాయం పొందుతూ చదువుకుంటున్న ఓ బాలిక మాటలు విన్న సూర్య చాలా ఎమోషనల్ అయిపోయారు. గాయత్రి అనే బాలిక మాటలు హీరో సూర్యని  కంటతడి పెట్టించాయి. పేదరికంలో పుట్టి న తనకు చదువుకోవాలనే కల అగరం  ఫౌండేషన్ ద్వారా సహకారం అయిందని  గాయత్రీ తెలిపింది. దీంతో హీరో సూర్య భావోద్వేగానికి గురై వేదికపైనే  కంటతడి పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: