ఈ ఆదివారం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ మెగాస్టార్ ముఖ్య అథిదిగా వచ్చారు. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ మాట్లాడుతు ఇలా ఉండాలి, ఇలాంటి వాతావరణమే నేను కోరుకున్నా.. ఇకనుంచి ఇలా స్టార్లంతా ఒక్కచోట కలవాలి, స్టార్ల అభిమానులకు ఇలాంటి పండగ వాతావరణమే ఉండాలి".. అంటూ తన స్టైల్ లో డైలాగులు చాలానే కొట్టారు. కానీ నందమూరి అభిమానుల్ని మాత్రం ఆయన హర్ట్ చేశారు. సంక్రాంతి సినిమాల లిస్ట్ చెప్తూ నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న 'ఎంత మంచివాడవురా' సినిమాను మరిచిపోయారు.

 

సరిలేరు నీకెవ్వరు తో పాటు సంక్రాంతి బరిలో ఉన్న మిగతా సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చిన చిరంజీవి అలవైకుంఠపురములో ప్రస్తావన తెచ్చారు. కుదిరితే తన ప్యామిలీ హీరో సినిమాకి కాస్త ఎక్కువగానే ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చి ఉండేవారేమో కానీ ఆయనకి అంత టైమ్ దొరకలేదు. ఆ వెంటనే దర్బార్ పేరు గుర్తు చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి, దీంతో మై ఫ్రెండ్ రజనీ మూవీ అంటూ చిరు దాన్ని కూడా పండగ సినిమాల్లో కలిపారు.

 

ఇవి కాక ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి అన్నారే కానీ ప్రత్యేకించి కల్యాణ్ రామ్ ఎంతమంచివాడవురా పేరు మాత్రం ప్రస్తావించలేదు. కనీసం పక్కనుంచి ఎవ్వరూ అందించలేదు కూడా. అసలైన పండగ రోజు జనవరి 15న కల్యాణ్ రామ్ మూవీ రిలీజవుతోంది. అల్లుఅర్జున్-మహేష్ బాబు బిగ్ ఫైట్ ముందు కల్యాణ్ రామ్ ని ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ ఈ సినిమా కూడా హిట్ అయ్యోలానే కనిపిస్తోంది.

 

మరికొన్ని సినిమాలు, మరికొన్ని అని ప్రస్తావించిన మెగాస్టార్.. కల్యాణ్ రామ్ పేరు చెప్పి విషెస్ చెప్పి ఉంటే.. అది ఇంకో లెవల్ లో ఉండేది. పోనీ చిరంజీవి మర్చిపోయినా దర్బార్ పేరు గుర్తు చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి, కల్యాణ్ రామ్ పేరు కూడా గుర్తుచేసి ఉంటే బాగుండేది. కల్యాణ్ రామ్ ఇచ్చిన ఆఫర్ తోనే అనీల్ రావిపూడి దర్శకుడిగా మారాడు. ఈరోజు పెద్ద డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి అనీల్ కూడా మరిచిపోయాడని అనుకోవడానికి వీల్లేదు.

 

ఏదేమైనా ఈ ఈవెంట్ లో అదొక్కటే కాస్త ఇబ్బంది కలిగించే అంశం. సహజంగానే నందమూరి ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ తో హర్ట్ అయ్యారు. చిరంజీవి స్పీచ్ ని ట్రోల్ చేస్తున్నారు. అందరూ కలిసుండాలి అని కోరుకునే చిరంజీవికి నందమూరి ఫ్యామిలీ ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నిస్తున్నారు. అనిల్ రావిపూడిని కూడా కలిపేస్తూ..  అంతేగా.. అంతేగా.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: