నటి నిధి అగర్వాల్ మొదటి సినిమా 'మున్నామైఖెల్‌'తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా, అందాలతోను అదరగొడుతోంది నిధి. 'సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది.

 

తర్వాత వరుస ఆఫర్లు కొట్టేస్తోంది ఈ చిన్నది. అటు సినిమాలు, ఇటు యాడ్లు, ఓపెనింగ్స్‌తో ఫుల్ బిజీ అయిపోయింది.ఒక హిట్టు ,ఒక ప్లాప్ చాలు సినిమా ఇండస్ట్రీలో నటినటులు యొక్క రెమ్యునరేషన్ మారడానికి.. సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరచయం అయిన నిధి అగర్వాల్... చిన్న చిన్న హీరోలతో నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆశించిన హిట్టు మాత్రం రాలేదు.

 

కానీ రామ్ హీరోగా పూరి డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ హిట్టు కావడంతో సినిమా ఆఫర్లు ఇప్పుడు ఈ భామ చుట్టూ తిరుగుతున్నాయి.అయితే తాజాగా ఈ హీరోయిన్ ఒక ఖరీదైన కారు కొంది... కారుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేసుకుని తన కొత్త కారు ఆనందాన్ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. హలో బ్యూటీ..

 

నీకు ఈ దశాబ్దంలోకి స్వాగతం అన్నట్లు గా కారును వెల్ కం చేసింది. నిధి చేసిన సినిమాలు చాలా తక్కువ కానీ "ఇంతలో ఎంతగా ఎదిగిపోయిందో" కదా అని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. నటిగా చేసింది తక్కువ సినిమాలె అయిన చాలా మంది హీరోయిన్స్ ఒక గుర్తింపు అనేది వచ్చాక ఏదోలా షోస్ చేయడం, యాడ్స్ చేయడం, కంపనీ అంబాసిడర్ గా ఉండి డబ్బు సంపాదిస్తున్నారు..

 

అమ్మడు ఇప్పుడు తన పారితోషికానికి మూడు రెట్లు పెంచిందనే ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం ఈ భామ చేతిలో నలుగురు సినిమాలు కూడా ఉన్నాయి.. ఏది ఏమయితేనే డబ్బు సంపాదించి కారు కొని కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది.

మరింత సమాచారం తెలుసుకోండి: