తెలుగు సినీ సంగీతంలో ఉద్దండులుగా పేరు తెచ్చుకున్న ఇద్దరు యువ సంగీత దర్శకుల్లో ఒకరు దేవీశ్రీ ప్రసాద్ అయితే రెండో వ్యక్తి ఎస్ఎస్ థమన్. ఇద్దరూ పెద్ద బడ్జెట్, చిన్న బడ్జెట్ సినిమాలకు సంగీతం అందించిన వాళ్లే. ప్రస్తుతం వారిద్దరి మధ్యా ఓ భారీ పోటీ జరుగబోతోంది. వాళ్లు సంగీతం అందించిన రెండు సినిమాలు రోజు తేడాలో నాలుగైదు రోజుల్లో విడుదల కాబోతున్నాయి. మహేశ్ తో దేవీశ్రీ ప్రసాద్ చేస్తే.. బన్నీతో థమన్ చేశాడు. ఈ రెండు సినిమాల మధ్యనే విపరీతమైన పోటీ ఉంటే.. సంగీతం విషయంలో వీరిద్దరి మధ్య పోటీ నెలకొంది.

 

 

పరిశీలిస్తే.. దేవీ సరిలేరు.. కు అందించిన సంగీతం బాగుంది.. కానీ రొటీన్ గానే ఉంది. థమన్ అల.. కు అందించిన సంగీతం ఇప్పటికే రికార్డుల మోత మోగించేసింది. మహేశ్ క్రేజ్ తో సరిలేరు.. కు బజ్ ఏర్పడితే, అల.. కు మూడు నెలలుగా మోగిపోయిన మూడు పాటలతో ఇప్పటకే విపరీతమైన బజ్ క్రియేట్ అవగా దానికి బన్నీ క్రేజ్, మెగాభిమానుల క్రేజ్ బోనస్ గా యాడ్ అయింది. రెండు టీజర్లను పరిశీలిస్తే దేవీ సరిలేరు.. కు ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ కంటే, అల.. కు థమన్ ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ పైస్థాయిలో ఉందనే చెప్పాలి.

 

 

నిజానికి థమన్ కంటే దేవీకే హిట్స్ ఎక్కువ. కానీ థమన్ అతి తక్కువ సమయంలో ఎప్పుడో వచ్చిన దేవీ కంటే ముందుగానే యాభై సినిమాల మార్క్ ను దాటేశాడు. కాపీ క్యాట్ అనే ముద్ర వేసుకని కొంత వెనుకబడ్డాడు. తొలిప్రేమ, భాగమతి, అరవింద.. సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. దేవీ రొటీన్ మ్యూజిక్ తో వెనుకబడి తడబడుతున్నాడు.  మరి ఈ సంక్రాంతికి గెలిచే పుంజు ఏదో తెలియాలంటే మరో నాలుగైదు రోజులు ఆగాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: