స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన హ్యాట్రిక్ సినిమా 'అల.. వైకుంఠపురములో'. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12 న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం రాత్రి మ్యూజికల్ ఈవెంట్ ను యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా  నిర్వహించారు. ఈ ఈవెంట్ లో  సినిమా ట్రైలర్ ను కూడా విడుదలచేశారు. ఇక ట్రైలర్ లో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా బనీ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అయితే ఎక్కడో లోపం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 

 

మిడిల్ క్లాస్ కష్ట సుఖాలు వీటికీ తోడు విలువలు అంటూ ఎప్పటిలాగే కాస్త క్లాస్ గా వెళ్ళినట్టు అనిపించింది. . బన్ని లాంటి మాస్ యాక్షన్ హీరోతో కుటుంబ కథల్ని వండుతున్నాడు. ఇంతకుముందు సన్నాఫ్ సత్యమూర్తి కి డివైడ్ టాక్ రావడానికి ఈ క్లాస్ ర్లిమెంటే అసలు కారణం. అయితే మరోసారి అలాంటి సీనే ఉంటుందా? అంటే అల వైకుంఠపురములో ట్రైలర్ చూడగానే కలిగిన ఫీలింగ్ కూడా అదే. వాస్తవంగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కి కూడా అదే తేడా కొట్టింది. 

 

అయితే మళ్ళీ త్రివిక్రమ్ అదే క్లాసీగా వెళుతున్నాడా? మాస్ కి కాస్త దూరంగానే ఎందుకు ఉంటున్నాడు అన్న సందేహం కలగేలా క్లాసీ ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. అల వైకుంఠపురములో మిడిల్ క్లాస్ స్ట్రగ్లింగ్ కుర్రాడి కథే.  చిన్నప్పటి నుంచి నా లైఫ్ లో ఆహా అనుకునే ఒక్క రోజు కూడా లేదు!! ఇది రియాలిటీ .. ఆల్మోస్ట్ యూత్ కి కనెక్ట్ అయ్యో లైన్ తీసుకున్న త్రివిక్రమ్ దానికి కార్పొరెట్ బ్యాక్ డ్రాప్.. సాఫ్ట్ వేర్ నేపథ్యం..పెద్ద కుటుంబాలతో కలిపి ముడి వేశాడు. 

 

అయితే సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ తర్వాత అల వైకుంఠపురములో ట్రైలర్ వచ్చింది కాబట్టి అభిమానుల్లో ఖచ్చితంగా కమేరిజన్ ఉంటుంది. అలా చూస్తే అల ట్రైలర్ కాస్త తక్కువనే ఫీలవుతున్నారు. సరిలేరు ట్రైలర్ తో పోలిస్తే అభిమానులకి 'అల' తక్కువే అనిపిస్తోంది. త్రివిక్రమ్ మార్క్ లో ఉంది కానీ .. అన్నట్టుగానే తేలిపోయింది. జనవరి 12న అసలు ఈ సినిమా ఏంటో తేలిసిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: