బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే గురించి మన ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్వతహాగా కన్నడ భాషకు చెందిన దీపికా, తొలుత హీరో ఉపేంద్ర సరసన ఒక సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఓం శాంతి ఓం అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసి, ఆ సినిమా సక్సెస్ తో మంచి పేరు సంపాదించింది. ఇక అక్కడినుండి పలు బాలీవుడ్ తో పాటు, ఇటీవల ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటించిన దీపికాకు హిందీ తో పాటు మిగతా భాషల్లో కూడా మంచి పేరుంది. 

 

ఇకపోతే కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ని ప్రేమించి మరీ వివాహం చేసుకున్న దీపికా పడుకొనే,  ప్రస్తుతం అతడితో హ్యాపీగా లైఫ్ గడుపుతూ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇకపోతే నిన్న వివాహం అనంతరం తొలి పుట్టినరోజును ఎంతో ఘనంగా జరుపుకున్న దీపికా, ప్రస్తుతం చపాక్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించి జరిగిన ఒక మీడియా సమావేశంలో మీడియా పై ఫైర్ అయింది దీపికా. అసలు ఏమి జరిగిందంటే, మీరు తల్లికాబోతున్నారని కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి కదా, 

 

అది నిజమేనా అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు దీపికా కొంత విరుచుకుపడుతూ సమాధానం ఇచ్చారు. నిజానికి తాను గర్భవతిని అయితే ఆ విషయాన్ని దాచుకోవలసిన అవసరం లేదని, అయినా తనని చూస్తుంటే గర్భవతిలా కనపడుతున్నానా అంటూ ప్రశ్నించింది. అదిమాత్రమే కాక, పోనీ నేను తల్లిని ఎప్పుడు అవ్వాలో మీరే డిసైడ్ చేసి చేప్పండి అప్పుడే బిడ్డను కంటాను అంటూ మాట్లాడడం జరిగింది. తనపై వస్తున్న ఇటువంటి పుకార్లు వింటుంటే ఎంతో చిరాకు వేస్తోందని, కావున దయచేసి ఇటువంటివి రాసేముందు ఒకసారి అలోచించి రాయాలని కోరుకుంటున్నట్లు మీడియా వారిని దీపికా కోరడం జరిగింది.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: