సినిమా క్రిటిక్ కత్తి మహేష్, ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి, ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. చాలా రోజుల పాటు నడిచిన ఆ వివాదం, ఆ తరువాత కొన్నాళ్ళకు కత్తి మహేష్ కు, పవన్ ఫ్యాన్స్ కు మధ్య సయోధ్య కుదిరి సర్దుమణిగింది. అయితే ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు కత్తి మహేష్, పవన్ పై  విమర్శలు సందిస్తూనే ఉన్నాడు. ఇకపోతే కొన్నాళ్ల క్రితం జరిగిన బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్న కత్తి మహేష్, పలు సినిమాల్లో కూడా అక్కడక్కడా చిన్న పాత్రల్లో నటించాడు. అంతేకాక ఒకానొక సమయంలో హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఆయనను కొన్నాళ్ల పాటు తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ కూడా చేసారు. 

 

అయితే ఆ తరువాత నుండి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా, అలానే కొన్ని ఇంటర్వ్యూ ల రూపంలో సమకాలీన రాజకీయ, సినీ విశేషాలపై విశ్లేషణలు మాత్రం ఇస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా కొన్నాళ్ల క్రితం, జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడంతో, ఆమెకు సపోర్ట్ చేస్తూ, తాను కూడా ఆమెకు ఆ విషయమై సహకరిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఆ తరువాత ఆమెది ద్వంద్వ వైఖరి, అప్పుడొక మాట, ఇప్పుడొక మాట మాట్లాడుతుంది అని ఒక వీడియో లో చెప్పాడు. కాగా ఆ వీడియోపై నేడు స్పందించిన శ్వేతా రెడ్డి, కత్తి మహేష్ పై విరుచుకుపడ్డారు. ఆమె మాట్లాడుతూ, మొదట్లో బిగ్ బాస్ లో క్యాస్టింగ్ కౌచ్ విషయమై సపోర్ట్ చేస్తాను అని చెప్పి, ఆ తరువాత మాయమయిన మహేష్,

 

మళ్ళి ఇన్నాళ్లకు ఈ విధంగా నా పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ఆమె అనడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్న కత్తి మహేష్
ఆ షో నిర్వాహకులకు మద్దతుగా నాపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, నిజానికి బిగ్ బాస్ లో జరిగిన వ్యవహారాలపై తాను న్యాయంగా పోరాటం చేసానని, అలానే ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద కూడా తన పోరాటం కొనసాగించామని చెప్పుకొచ్చింది. అదిమాత్రమే కాక, తనను వేధించిన వారిపై పెట్టిన కేసు ప్రస్తుతం విచారణకు వచ్చిందని ఇటీవల పోలీసుల నుండి సమాచారం కూడా వచ్చిందని చెప్పింది. మొదట్లో నన్ను లీగల్ కూడా వెళ్ళమని బోడి, బొచ్చులో సలహాలు ఇచ్చిన నువ్వు, ఇప్పుడు నన్ను తప్పుపడుతున్నావా అంటూ మొత్తంగా విరుచుకుపడుతూ ఒక వీడియోని పోస్ట్ చేసింది. కాగా ఈ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: