మహేష్ బాబు హీరోగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరున్ సినిమా జనవరి 11 న రాబోతున్నది.  ఇప్పటికే సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది.  ట్రైలర్ అదిరిపోయింది అని చెప్పాలి.  ట్రైలర్ లో కామెడీ పిచ్చపిచ్చగా ఉన్నది.  అనిల్  ఈ సినిమాను ఎంటర్టైన్మెంట్ వే లో తీస్తూనే సినిమాకు కావలసిన అన్నిరకాల మాస్ ఎలిమెంట్స్ ను ఇందులో చూపించబోతున్నాడు.  బోర్డర్ లో ఉన్న సైనికులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నారు.  


మహేష్ బాబు సినిమాలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా చాలా మంచి వ్యక్తి.  అందులో సందేహం అవసరం లేదు.  సౌమ్యుడు.  చాలా క్యూట్ గా ఉంటాడు.  ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది.  అలానే అందరికంటే ఏ విషయంలోనైనా ముందు ఉంటారు.  అన్నింటికీ మించి అబ్బాయి చాలా క్యూట్ అంటోంది రష్మిక.  రష్మికకు ఈ సినిమాలో ఓ సాంగ్ ఉన్నది.  మహేష్ బాబు గుణగణాలను పొగుడుతూ సాంగ్ అది.  


ఆ సాంగ్ అదిరిపోతోందని అంటోంది.  ఇక ట్రైన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలవనుంది.  సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు.  ఈ సినిమాకు మహేష్ బాబు కూడా ఒక ప్రొడ్యూసర్ గా ఉండటంతో సినిమాను ఇంకాస్త బాగా తీసి ఉంటారు.  సినిమాను మహేష్ బాబు చాలాబాగా ప్రేమిస్తారు.  అది ఎలాంటి ప్రేమ అంటే చెప్పలేం.  సినిమా కోసమే జీవించే వ్యక్తి మహేష్ బాబు.  


అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  ఇక బయట కూడా మహేష్ దయాగుణం ఎక్కువ.  మహేష్ 1000 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన వ్యక్తి మహేష్.  ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.  దీనిని విజయశాంతి ఇటీవలే సినిమా ప్రీ రిలీజ్ వేడుక సమయంలో పేర్కొన్నది.  మెగాస్టార్ చిరంజీవి కూడా మహేష్ బాబు గురించి గొప్పగా చెప్పారు.  అంతేకాదు, మహేష్, మెగాస్టార్ కాంబినేషన్లో ఓ సినిమా కూడా ఉండబోతుందని టాక్ వస్తోంది.  మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: