త్రివిక్రమ్ అంటే .. మాటలతో గారడీ చేసి ప్రేక్షకలను ఆకట్టుకోవడంలో ఈయన తర్వాతే ఎవరైనా సినిమా హిట్ అవుతుంది అంటే త్రివిక్రమ్ మ్యాజిక్ తోనే.. ప్రేక్షకులను ఎలా చేస్తే ఆకర్షితులవుతారు. అన్న సంగతి త్రివిక్రమ్ కు తెలుసు. హీరోలతో సినిమాకు పనిలేకుండా కేవలం సినిమాను తన ఫేమ్‌తో ఆడించగలిగిన డైరెక్టర్లలో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడిగా ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..

 

అజ్ఞాతవాసి సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా మారడంతో కాస్త గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు..సంక్రాంతికి ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వీరిద్దరి కలయికలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. అందుకే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతూ చిత్ర యూనిట్ విడుదల చేసిన అన్ని పాటలకూ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కానీ టీజర్‌కు మాత్రం మిశ్రమ స్పందన రావడం విశేషం..

 

ఇది ఇలా ఉండగా సక్సెస్ కు మారు పేరు అయిన త్రివిక్రమ్ కు 2018 సంవత్సరం మొదట్లో కలిసిరాలేదు.. అందుకే ఆతర్వాత వచ్చిన ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రం ద్వారా ఘన విజయం సాధించి మళ్లీ ఫాంలో వచ్చాడు.. ఆ సినిమా ఘన విజయం త్రివిక్రమ్ ను మళ్లీ లైన్ లో వచ్చాడు..ఒక్క అడుగు వెనక్కి వేసాడంటే బుల్లెట్ లాగా వంద అడుగులు వేస్తాడని త్రివిక్రమ్ నిరూపించాడు..

 

ఇప్పుడు అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్న.. అల వైకుంఠపురం లో సినిమా తీస్తున్నాడు.. ఇప్పటివరకు ఈసినిమా నుండి వచ్చిన అన్ని ఒక ఎత్తైతే ఇప్పుడు తాజాగా జరిగిన ఈ సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ ను ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి చిత్రబృందం చేసిన అల్లరి అంతా ఇంతా కాదు..జనాల్లో కూడా మంచి బజ్ ను తీసుకొచ్చారు.. దీంతో సినిమా విడుదల కాకముందే హిట్ టాక్ ను అందుకున్నారు..ఇక సినిమా ఎలా హిట్ అవుతుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: