టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కిన  చిత్రం అలా వైకుంఠపురములో. ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది  ఈ సినిమా. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ట్రైలర్ కి ఎనలేని ఆదరణ లభించింది. ప్రేక్షకులందరినీ ఒక రేంజ్ లో ఆకర్షించాయి ఈ సినిమా పాటలు. ఏకంగా రికార్డులు సృష్టించాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. కాగా ఈ సినిమా ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్ లో మ్యూజిక్ గురించి ఈవెంట్ కు వచ్చిన అందరూ ఎంతో అద్భుతంగా ఉంది అంటూ కితాబిచ్చారు. ఆ తర్వాత మాట్లాడిన అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 

 ఈ సినిమాలో నేషనల్ అవార్డు విన్నర్ టబు  గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది అంటూ అల్లుఅర్జున్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమా చేయడం కూడా ఆనందంగా ఉందని ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే బలమైన కారణం త్రివిక్రమే అని చెప్పుకొచ్చారు. నా ప్రతి ఇష్టాన్ని త్రివిక్రమ్ గారు ఈ సినిమాలో చూపించారు అంటూ  చెప్పారు అల్లు అర్జున్ . అయితే ఎవరికైనా ఫాన్స్ ఉంటారు నాకు మాత్రం ఆర్మీ ఉంది అంటూ చెప్పుకొచ్చారు. నాకు పెద్ద మావయ్య చిరంజీవి గారు అంటే ప్రాణం... ఈ కట్టే కాలే  వరకు చిరంజీవి గారి అభిమానినే... ఇక మామయ్య తర్వాత ఇష్టమైన వ్యక్తి రజినీకాంత్ గారు. 

 

 

 

 రజినీకాంత్ గారు నటించిన దర్బార్, మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు,  ఎంత మంచి వాడవురా సినిమాలు అన్ని మంచి విజయం సాధించాలి. ఈ సినిమాల చిత్ర బంధాలకు ఆల్ ది బెస్ట్ అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అయితే ఈ సందర్భంగా అల్లు అర్జున్ మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మాత్రం ఎక్కడా తీయలేదు అల్లు అర్జున్. ఓ వైపు ఫ్యాన్స్ అందరూ పవర్ స్టార్...పవర్ స్టార్ అనే  అరుస్తున్నప్పుడు కూడా అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనే తీయలేదు. దీంతో పవన్ గురించి రెండు మాటలు మాట్లాడితే సరిపోతుంది కదా అనవసరంగా అల్లుఅర్జున్ ఎందుకు కాంట్రవర్సీ చేస్తాడు అంటూ మెగా ఫ్యాన్స్, పవన్ ఫాన్స్ కూడా ఫీల్ అవుతున్నారట. దీంతో అల్లు అర్జున్ తీరుపై పవన్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు అని కూడా టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి మధ్య ఇప్పటికే వైరం ఉండడం.. ఇప్పుడు పవన్ గురించి ఒక్క మాట కూడా అల్లు అర్జున్ మాట్లాడకపోవడం.. వల్ల పవన్ ఫాన్స్ కాస్త హర్ట్ అయ్యారు అని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: