ఈ సంక్రాంతికి తెలుగులో రెండు భారీ చిత్రాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ రెమ్డు భారీ చిత్రాల మీద అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అయితే వీటితో పాటు ఒక చిన్న చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమానే కళ్యాణ్ రామ్ నటించిన "ఎంత మంచివాడవురా" సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమా మీద ఎక్కువ అంచనాలు లేవు.

 

కానీ గత కొన్ని సంవత్సరాలుగా పరిశీలిస్తే ఏమాత్రం అంచనాలు లేని సినిమాలు సైతం బాక్సాఫీసును కొల్లగొట్టాయి. 2016లో వ‌చ్చిన నాగార్జున సినిమా సోగ్గాడే చిన్నినాయ‌నా కావ‌చ్చు.. 2017లో రిలీజైన శ‌త‌మానం భ‌వ‌తి కావ‌చ్చు.. గ‌త ఏడాది వ‌చ్చిన ఎఫ్‌-2 కావ‌చ్చు. మిగ‌తా సంక్రాంతి భారీ చిత్రాల‌తో పోలిస్తే వీటిపై అంచ‌నాలు త‌క్కువే. కానీ ఈ  ఫ్యామిలీ సినిమాలు అంచ‌నాల‌కు అంద‌ని రీతిలో భారీ విజ‌యం సాధించాయి.

 

ఈ సినిమాలా లాగే ఇప్పుడు ఎంత మంచివాడవురా సినిమాపై కూడా ఎక్కువ అంచనాలు లేవు. అయితే సతీష్ వేగేశ్న తన సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. శతమానం భవతి లాంటి సినిమాతో విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు మళ్ళీ అలాంటి మ్యాజిక్ ఈ సినిమా ద్వారా అవుతుందని గట్టి విశ్వాసంతో ఉన్నాడు. ఇప్పటికే విడుదల అయిన టీజర్లు పాటలని చూస్తుంటే ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.

 

అయితే ఒక్కటే ఇబ్బంది. కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ సినిమాలు చాలా తక్కువగా చేశాడు. ఒకటీ అరా చేసినా కూడా వాటికి ఆదరణ లభించింది చాలా తక్కువ. అందువల్ల ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తుందా అనే అనుమానం అందరిలోనూ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: