సరిలేరు నీకెవ్వరు చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా విదదలకి సిద్ధమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చిన ఈ ఈవెంట్ ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో చూశాం. అయితే సినిమా కూడా ఆ రేంజ్ లోనే సక్సెస్ సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారట.

 

అలా నమ్మడానికి రెండు పరిణామాలు కూడా చొటు చేసుకున్నాయి. అవేంటంటే  ఒకటి అనిల్ రావిపూడి కి అబ్బాయి పుట్టడం. మెగాస్టార్ అతిథిగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ రోజే అనిల్ కి అబ్బాయి పుట్టడం మంచి శుభపరిణామమని భావిస్తున్నారు. అలాగే ఈ మూవీ నిర్మాణ భాగస్వామిగా ఉన్న దిల్ రాజు కు కూడా నిన్నటి రోజే మనవరాలు పుట్టారట.

 

నూతన సంవత్సరం ప్రారంభంలో దర్శక నిర్మాతల ఇంట్లోకి కొత్త అతిథులు రావడంతో పాటు సినిమాకు వస్తున్న రెస్పాన్స్.. అన్ని కలగలుపుకొని ఈచిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. విడుదలకు ముందు జరుగుతున్న శుభపరిణామాలే ఇందుకు సూచకం అని భావిస్తున్నారు. అందువల్ల ఈ పరిణామాలు సినిమా హిట్ అనే భావనని కలిగిస్తున్నాయి. దాంతో చిత్ర యూనిట్ మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్ తో నిండిపోయింది.

 


అదీ గాక సినిమా ట్రైలర్ కి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ ని ట్రైలర్ లో ఇమడ్చడం చాలా ప్లస్ అవనుంది. మొదటి నుండి చెబుతున్నట్టుగానే ఈ ఎపిసోడ్ థియేటర్లో రచ్చ లేపడం ఖాయం అనిపిస్తుంది. మాస్ ఎలిమెంట్స్ తో పాటు, వినోదం కూడా చేరడంతో ఈ సినిమా గ్యారెమ్టీగా హిట్ కొడుతుందనే అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: