‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు విపరీతంగా బన్నీ అభిమానులు వచ్చినా ఈఫంక్షన్ లో తమన్ లైవ్ ఆర్కెస్ట్రా హైలెట్ గా మారినా ఎదో ఒక తెలియనిలోటు ఆఫంక్షన్ లో కనిపించింది అంటూ నిన్న జరిగిన ‘అల’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై కామెంట్స్ వస్తున్నాయి. సినిమా ఫంక్షన్స్ సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయి.

తమ ఫంక్షన్ కు ఇండస్ట్రీకి సంబంధించిన ఒకప్రముఖ వ్యక్తిని అతిధిగా పిలిచి హడావిడి చేయడం లేదంటే కేవలం యూనిట్ సభ్యులు అంతా ఒకచోట చేరి ఒక కుటుంబ ఫంక్షన్ లా జరుపుకోవడం. త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ ఫంక్షన్ కు ఎవర్నీ పిలవకుండా ఒక కుటుంబ ఫంక్షన్ లా జరుపుతూ భారీ సినిమాల ఫంక్షన్స్ లా ఓపెన్ గ్రౌండ్ లో వేలాది జనం మధ్య చేసాడు. 

ఇంత వరకు ఈవిషయాలు బన్నీ అభిమానులకు బాగానే ఉన్నా ఈఫంక్షన్ కు ఎవరో ఒకప్రముఖ వ్యక్తి ముఖ్య అతిధిగా రాకపోవడం ఒక లోటుగా అనిపించింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు నిన్నటి ‘అల’ ఫంక్షన్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ ఫంక్షన్ లో కనిపించిన చిరంజీవి విజయశాంతి లాంటి టాప్ పొలిటికల్ టచ్ ఉన్న సెలెబ్రెటీలు లేకపోవడంతో నిన్నటి ఫంక్షన్ లో ఎటువంటి సంచలనాలు లేకుండా కేవలం ఒకసాధారణ సినిమా ఫంక్షన్ లా ‘అల’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

మిడిల్ క్లాస్ జీవితాలు జీవితంలో విలువలు ఈవిషయాలు అన్ని వినడానికి కధలలో చదవడానికి బాగుంటాయి. కానీ ఒక మాస్ సినిమా  ఘన విజయానికి ఈవిషయాలు పెద్దగా సహకరించవు. ‘అల వైకుంఠపురములో’ ట్రైలర్ విడుదల అయిన తరువాత ఆట్రైలర్ ను ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ తో పోలుస్తూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. ‘అల’ ట్రైలర్ ను చూసిన వారికి త్రివిక్రమ్ తనదైన వేలో క్లాసీగానే వెళుతున్నాడా ?   మాస్ కి కాస్త దూరంగానే వెళుతున్నాడా ? అన్న సందేహం కలగజేసేలా ఈట్రైలర్ ఉంది అన్నకామెంట్స్ వస్తున్నాయి. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ లో మసాలా ఎలిమెంట్స్ కామెడీ బాగా దట్టించడంతో ట్రైలర్ విషయంలో ‘అల’ ‘సరిలేరు’ నీకెవ్వరు ఆధిపత్యం సాధిస్తే పాటల విషయంలో ‘అల’ ‘సరిలేరు’ పై తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: