మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్ మాటలు ఎంత పదునుగా ఉంటాయో తెలిసిందే. తన సినిమాలో ప్రతీ పాత్ర మాటల ద్వారా మనల్ని నవ్వించడమో..ఆలోచింపజేయడమో చేస్తుంది. చిన్న చిన్న పాత్రలకి కూడా పెద్ద పెద్ద ఆలోచనలు కలుగజేసే మాటలు ఇవ్వడం త్రివిక్రమ్ కే సొంతం. ఆయన సినిమాల్లో పనిమనుషులు సైతం పంచులు వేస్తారు. అదే ఆయన గొప్పతనం. అయితే త్రివిక్రమ్ సినిమాల్లోనే కాదు స్టేజి మీద కూడా తన మాటల ద్వారా మ్యాజిక్ చేస్తాడు.

 


స్టేజి మీద ఎక్కువగా కనిపించని త్రివిక్రమ్..మాట్లాడిన ఒకటి రెండు మాటలు కూడా ఆసక్తిని రేపేలా ఉంటాయి. ఒకానొకసారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి చెప్పిన మాటల్ని మర్చిపోగలమా...ప్రస్తుతం త్రివిక్రమ్ నుండి అల వైకుంఠపురములో అనే చిత్ర్ం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ నైట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యూజికల్ నైట్ లో త్రివిక్రమ్ మరోసారి తన మాటలతో మ్యాజిక్ చేశాడు.

 


బన్ని గురించి మాట్లాడుతూ కూడా ఆయన ప్రాసలు వదిలిపెట్టలేదు. ``బన్ని అప్పుడు వేరు. ఇప్పుడు వేరు. అతడు ఇద్దరు పిల్లల తండ్రి. అందుకే బన్ని అనను.. అల్లు అర్జున్ అనే అంటాను. తన స్థాయి పెరిగింది. పరిణతి పెరిగింది. ఇలాంటి కథను ఎంకరేజ్ చేశారు. దర్శకనిర్మాతలంతా సాహసం చేశాం. తప్పులు చేసినా వెంట ఉంటామన్నారు నిర్మాతలు. సక్సెస్ చేసినా వెంట ఉన్నామన్నారు. 

 

ఇంకా సంగీతం గురించి మాట్లాడుతూ మనసు దురద పెడితే గొక్కునే ఆయుధం సంగీతం అని సంగీతానికి ఓ సరికొత్త డెఫినేషన్ ఇచ్చారు. అంతే కాదు పాటని ప్రేయసి అని అందమైన ఆడపిల్ల అని పాటని వర్ణించిన తీరు నిజంగా అద్భుతం. ఇక ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించిన థమన్ కి తన కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే అద్భుతమైన సాహిత్యం అందించిన సీతారామ శాస్త్రి గురించి ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: