ప్రభాస్ జిల్ రాథాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి ‘జాన్’ ‘జాను’ అన్న టైటిల్స్ లో ఎదో ఒకటి ఫిక్స్ చేస్తారు అంటూ తెలుగు మీదియాలోనే కాకుండా బాలీవుడ్ మీడియాలో కూడ వార్తలు వచ్చాయి. ‘సాహో’ ఫెయిల్యూర్ తరువాత ప్రభాస్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారిన ఈ మూవీ కథ విషయంలో ‘సాహో’ ఫెయిల్యూర్ తరువాత అనేక మార్పులు జరిగాయి. ఈ మధ్యనే ఈమూవీ షూటింగ్ మళ్ళీ మొదలైంది.

ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే జనంలోకి బాగా చొచ్చుకుని పోయిన తన టైటిల్ ను ఇప్పుడు ప్రభాస్ శర్వానంద్ కోసం త్యాగం చేయడం హాట్ న్యూస్ గా మారింది. తమిళ మూవీ ‘96’ రీమేక్ గా శర్వానంద్ సమంతలు కలిసి నటిస్తున్న ఈ మూవీకి నిర్మాత అయిన దిల్ రాజ్ ఒత్తిడితో ప్రభాస్ ఈ త్యాగం చేయక తప్పలేదు అని అంటున్నారు. 

ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ మరి కొన్ని గంటలలో అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ మూవీలో నటిస్తున్న సమంత పాత్రకు జానకీ అన్న పేరు పెట్టడంతో ఈ సినిమా కథ రీత్యా ‘జాను’ బాగుంటుందని దిల్ రాజ్ భావించడంలో ప్రభాస్ మూవీ టైటిల్ శర్వానంద్ వైపుకు మళ్ళింది. 

గత కొంత కాలంగా సరైన విజయాలు లేక శర్వానంద్ చాల సతమతమై పోతున్నాడు. గత సంవత్సరం అతడికి జరిగిన యాక్సిడెంట్ నుండి చాల త్వరగా కోలుకుని ఈ సినిమాను పూర్తి చేసాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’ రీమేక్ గా తీయబడుతున్న ఈ మూవీలో కథ రీత్యా చాల మార్పులు జరిగాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఈసారి సమంత గోల్డెన్ లెగ్ ప్రభాస్ త్యాగం ఇలా ఈ రెండు కూడ శర్వానంద్ ను రక్షించ లేకపోతే ఈ సంవత్సరం శర్వానంద్ కెరియర్ కు గడ్డు కాలం అనే చెప్పాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: