సాధారణంగా అల్లు అర్జున్ రాజకీయాలకు దూరంగా ఉంటాడు. రాజకీయ నాయకుల పై దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పై ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బన్నీ స్పందించిన సందర్భాలు లేవు. అలాంటి బన్నీ స్పీచ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని పరోక్షంగా టార్గెట్ చేస్తూ అర్ధం వచ్చేలా కామెంట్స్ చేయడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.

ఈమధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న రెండు నిర్ణయాలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. వాటిలో ఒకటి అమరావతి రాజధాని మార్పు అయితే మరొకటి ప్రభుత్వ స్కూల్స్ లో తెలుగు మీడియం తీసివేసి ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టడం. ఈ నిర్ణయం తెలుగు భాష అభిమానులకు విపరీతంగా అసహనాన్ని కలిగిస్తోంది. 

ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో అల్లు అర్జున్ నిన్న జరిగిన ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తెలుగును బతికించాలని అన్నాడు. సినిమాల్లో కూడా ఖచ్చితంగా తెలుగు పాటలు ఉండాలని వాటిలో తెలుగు జానపదం కనిపించాలని బన్నీ అభిప్రాయ పడ్డాడు. అందుకే తెలుగుదనం ఉట్టిపడే పాటల్నే ‘అల వైకుంఠపురములో’ సినిమాలో  పెట్టిన విషయాన్ని వివరిస్తూ తెలుగు బతికించుకోవాలని తెలుగు ఉండాలని బన్నీ అబిప్రాయపడ్డాడు. 

అయితే ఈ కామెంట్స్ సీఎం జగన్‌ ను ఉద్దేశించి అనకపోయినా ఏపీలో ఇంగ్లీష్ మీడియం అంటూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లేనని రాజకీయ విశ్లేషకులు బన్నీ కామెంట్స్ పై అర్ధాలు వెతుకుతున్నారు. ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండే బన్నీ ‘అల వైకుంఠపురములో’ విడుదల సమయంలో టిక్కెట్ల రేటు పెంపుకు స్పెషల్ షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతులు కావలసిన పరిస్థితులలో బన్నీ ఈరకంగా ఎందుకు కామెంట్స్ చేసాడు అంటూ కొందరు ఆశ్చర్య పోతున్నారు. దీనితో అల్లు అర్జున్ యాధృశ్చికంగా అన్న కామెంట్స్ కు ‘అల వైకుంఠపురములో’ స్పెషల్ షోల ప్రయత్నాలకు అనుకోని తలనొప్పులు తెచ్చి పెడుతుందా అంటూ ఈ మూవీ బయ్యర్లు భయపడి పోతున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: