టాలీవుడ్ లో నట వారసులు వస్తున్న సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు తనయుడు వెంకటశ్ హీరోగా ‘కలియుగపాండవులు’ మూవీతో పరిచయం అయ్యారు.  మొదట్లో యాక్షన్ సినిమాలతో అలరించినప్పటికీ తర్వాత ఫ్యామిలీ తరహా సినిమాలతో తనదైన మానరీజంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.  విక్టరీ అనేది తన పేరు ముందు ఉంచుకొని విక్టరీ వెంకటేష్ గా తన సత్తా చాటాడు.  ప్రస్తుతం వెంకటేష్ ఎక్కువగా మల్టీస్టారర్ మూవీస్ లో నటిస్తున్నారు.  ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాన్, రామ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో నటించిన వెంకి మొదటి సారిగా తన మేనళ్లుడు అక్కినేని నాగ చైతన్యతో కలిసి ‘వెంకిమామ’ మూవీలో నటించారు.  

 

ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహించారు.  కామెడీ, సెంటిమెంట్ తో ఉన్న ఈ మూవీ మంచి హిట్ అయ్యింది.  విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటించిన వెంకీ మామ చిత్రం ఫుల్ రన్ కు చేరువగా వచ్చింది.  దాదాపు 36 కోట్లకు ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల నుండే 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

 

క్రిస్మస్ హాలిడేస్ తో పాటు న్యూ ఇయర్ ఈవ్ ను కూడా క్యాష్ చేసుకున్న వెంకీ మామ 24 రోజులు గడిచేసరికి ప్రాఫిట్స్ లో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 32 కోట్లు వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా 38 కోట్లు వసూలు చేసింది.  ఇక సంక్రాంతి బరిలో టాప్ హీరోల మూవీస్ ఉండటంతో ఈ మూవీ కలెక్షన్లు పడిపోయే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. 

 

24 రోజుల ‘వెంకీ మామ’ కలెక్షన్స్ :


నైజాం : Rs 12.45 కోట్లు

సీడెడ్ : Rs 4.89 కోట్లు

వైజాగ్ : Rs 5.39 కోట్లు

గుంటూరు: Rs 2.39 కోట్లు

కృష్ణ : Rs 1.94 కోట్లు

ఈస్ట్ : Rs 2.43 కోట్లు

వెస్ట్ : Rs 1.48 కోట్లు

నెల్లూరు : Rs 1.06 కోట్లు

ఆంధ్ర+ తెలంగాణ : Rs 32.03 కోట్ల షేర్

రెస్ట్ ఆఫ్ ఇండియా: Rs 2.70 కోట్లు

ఓవర్సీస్ : Rs 3.24 కోట్లు

వరల్డ్ వైడ్ : Rs 37.97 కోట్ల షేర్

మరింత సమాచారం తెలుసుకోండి: