సంక్రాంతి అంటే టాలీవుడ్ లో సినిమాల పండుగే. ఈసారి ఎన్ని సినిమాలు ఉన్నా.. బన్నీ అల వైకుంఠపురంలో.. మహేశ్ సరిలేరు నీకెవ్వరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందులోనూ పోటాపోటీగా ఒకే రోజు రిలీజవుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల ట్రైలర్లు వచ్చేశాయి. ఇంటర్ నెట్లో సందడి చేస్తున్నాయి. రెండు ట్రైల‌ర్లూ వచ్చేయడంతో ఇప్పుడు వాటి మధ్య పోలిక మొదలైంది.

 

అయితే ఈ రెండు ట్రైలర్లు చూస్తే సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ ముందు.. అలవైకుంఠపురములో ట్రైలర్ కాస్త చిన్నబుచ్చుకున్నట్టే కనిపిస్తోంది. సరిలేరు ట్రైలర్ తో పోలిస్తే సగటు అభిమానికి వన్ సైడెడ్ గా ఒక మెట్టు తక్కువే అనిపిస్తోంది. ఇక సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ మాత్రం ఆద్యంతం హుషారుగా కామెడీతో అదరగొట్టేసిందన్న టాక్ వినిపిస్తోంది. ఇక మహేశ్ ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకుంటున్నారు. బొమ్మ హిట్టు ఖాయం అని నమ్మకానికి వచ్చేశారు.

 

సరిలేరు ట్రైలర్ లో ముఖ్యం ట్రైన్ ఎపిసోడ్, అబ్బబ్బా.. అనే మేనరిజం, అర్థమవుతుందా అనే మేనరిజం, విజయశాంతి ఛార్మింగ్, ప్రకాశ్ రాజ్ విలనీ.. అంతా సమపాళ్లలో కుదిరి సినిమాపై హోప్స్ అమాంతం పెంచేస్తోంది. అల వైకుంఠపురంలో ట్రైలర్ కూడా బాగానే ఉన్నా.. సరిలేరునీకెవ్వరుతో పోలిస్తే మాత్రం తేలిపోతోందన్న టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

 

అందుకే.. సరిలేరు ట్రైలర్ చూశాక.. మహేశ్ ప్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మావాడి ట్రైల‌ర్ సూప‌రెహే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే అల వైకుంఠపురములో సినిమాకు పాటలు బలమైన ఆకర్షణ. సామజవరగమనా వంటి పాటలు సినిమా కంటే ముందే సూపర్ డూపర్ హిట్టై కూర్చున్నాయి. పాటలు సూపర్ గా ఉన్నా.. మూవీకి క్లాస్ ట‌చ్ ఎక్కువైన‌ట్టు ట్రైలర్ లో కనిపిస్తోంది. మొత్తానికి ఈ సంక్రాంతికి మహేశ్ తో బన్నీకి ఠఫ్ కాంపిటీషన్ తప్పేటట్టు లేదు. మరి ఎవరి సత్తా ఎంతో బొమ్మలు తెరపైకి వస్తే కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: