సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై కేక పుట్టిస్తోంది. ఈ ట్రైలర్ లో ట్రైన్ ఎపిసోడ్, అబ్బబ్బా.. అనే మేనరిజం, అర్థమవుతుందా అనే మేనరిజం, విజయశాంతి ఛార్మింగ్, ప్రకాశ్ రాజ్ విలనీ.. అంతా సమపాళ్లలో కుదిరి సినిమాపై హోప్స్ అమాంతం పెంచేస్తోంది. కామెడీకి కామెడీ.. హీరోయిజానికి హీరోయిజం చక్కగా కుదరడంతో మహేశ్ ఖాతాలో మరో సూపర్ హిట్ ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.

 

అయితే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక క్యారెక్టరైజేషన్ ఆసక్తి రేపుతోంది. మహేశ్ బాబు అంటే పడిచచ్చిపోయే టైపుగా హీరోయిన్ ను చూపించారు. ట్రైలర్ లోనూ ఎక్కువగా రష్మిక ప్రేమావేశాన్నే హైలెట్ చేశారు. అయితే దీన్ని ప్రేమావేశం అనే కంటే కామావేశం అనే తరహాలో చూపించడం ఆడియెన్సులో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇంతకు ముందే ఇదే తరహాలో ఓ పాట కూడా విడుదలైంది.

 

హీరో అంటే హీరోయిన్ కు క్రేజ్ ఉండటం అంత వింతేమీ కాకపోయినా.. ఏకంగా హీరో కనిపిస్తే చాలు పూనకాలు వచ్చే స్థాయిలో ఈ పాత్రను తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. ఒక సీన్ లో అయితే ఏకంగా చుట్టూ మహేశ్ ఫ్రెండ్స్ ఉన్నా సరే.. మీద పడిపోయి కౌగిలించుకుని వదలకుండా ఉంటుంది. చివరకు మహేశ్ బాబు ఆమెను వదిలించుకుంటూ తీసుకెళ్లండిరా బాబూ అని మొత్తుకోవడం కాస్త ఓవర్ గానే కనిపిస్తోంది. మరి దీన్ని సినిమాలో ఎలా జస్టిఫై చేసుకుంటారో చూడాలి.

 

ఏదేమైనా ఈ సినిమాలో రష్మిక మహేశ్ బాబు అంటే పడిచచ్చిపోయే క్యారెక్టర్ లో బాగానే జీవించింది. ఆమె ఎంతగా ఆ పాత్రలో లీనమై పోయిందంటే.. అలా వదిలేస్తే అక్కడే అందరి ముందే మహేశ్ ను రేప్ చేస్తుందేమో అనే లెవల్లో ఉంది ఆ క్యారెక్టరైజేషన్. మరి ట్రైలర్ లోనే ఇలా ఉంటే.. ఇక సినిమాలో ఇంకెలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: