ప్రశాంతంగా ఎవరి దారిన వారు జీవిస్తున్న వారిని వివాదాల్లోకి కావాలని లాగి గొడవ క్రియేట్ చేయడం ఎవరికీ మంచిది కాదు. తమకు ఇబ్బంది కలిగించిన వారిపై కామెంట్లు, డైలాగులు వేసినా అర్ధం ఉంటుంది కానీ ఇలా.. ఊరికే వివాదం క్రియేట్ చేయడం ఎవరికీ మంచిది కాదు. వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఇప్పుడదే చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. తనకు జరిగిన అన్యాయంపై గళమెత్తిన శ్రీరెడ్డి మంచి ఉద్యమానికే పూనుకుంది. అంతవరకూ బాగానే ఉన్నా ఎటువంటి కాంట్రవర్శీల్లో లేని అల్లు అర్జున్ ని కూడా విమర్శించటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

 

 

ప్రతి సమస్యపై తన సోషల్ మీడియా అకౌంట్ ఫేస్ బుక్ ద్వారా స్పందించే శ్రీరెడ్డి తన తాజా పోస్ట్ లో అల్లు అర్జున్ పై సెటైర్ వేసింది. ‘అల్లు అర్జునా.. ఎప్పటికైనా నీ ఒరిజినల్ హైయిర్ తో సినిమాల్లోకి వస్తావా.. రావా? ఎప్పుడూ విగ్గేనా?’ అంటూ సెటైర్ వేసింది. దీంతో.. ఇప్పటివరకూ ఎటువంటి కాంట్రవర్శీల్లోకి రాని అల్లు అర్జున్ ని టార్గెట్ చేసినట్టైంది. నిజానికి బన్నీ ఎవరిపై ఎటువంటి కాంట్రవర్శీ డైలాగ్స్ వేయడు. ఇప్పటి వరకూ అలాంటి వివాదాల్లోకి కూడా బన్నీ రాలేదు. ఈ పోస్ట్ పై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. శ్రీరెడ్డిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

 

శ్రీరెడ్డి పెట్టిన పోస్టులపై బన్నీ ఫ్యాన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. తాను గుడి శుభ్రం చేస్తున్న ఫోటోను ఉద్దేశించి.. ‘గుడి శుభ్రం చేయడం కాదు.. నీ మనసును శుభ్రం చేసుకో’, ‘మెగా ఫ్యామిలీ హీరోలను టార్గెట్ చేయడం కాకపోతే బన్నీ గురించి ఎందుకు’.. వంటి కామెంట్లు చేస్తున్నారు. శ్రీరెడ్డి టార్గెట్ చేసిన హీరోల్లో నాని, విశాల్.. ఇలా చాలామందిపై కామెంట్లు చేసింది. బన్నీనే కాకుండా మెగా హీరోలపై ఆమె చేసిన కామెంట్లు ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: