కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మాస్ సినిమాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న తాజా సినిమా దర్బార్. తన కెరీర్ లో మురుగదాస్ తొలిసారిగా ఒక కాప్ స్టోరీ గా ఈ సినిమాని తీస్తుండగా, ఇందులో రజినీకాంత్, ఆదిత్య అరుణాచలం అనే మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే రజిని నటించిన 2.0. పేట సినిమాలు మంచి సక్సెస్ సాధించివుండడంతో, తప్పకుండా ఈ సినిమా కూడా హిట్ సాధించి, ఆయనకు హ్యాట్రిక్ విజయాలు అందించడం ఖాయం అని రజిని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్ గా నటిస్తున్నారు. 

 

ఇటీవల సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సారధ్యంలో రూపొందిన పాటలు యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి స్పందనను రాబట్టాయి. ఎల్లుండి రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ టాక్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం. రజిని పవర్ఫుల్ ఎంట్రీ తో అదిరిపోయేలా ప్రారంభమయ్యే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కొంత ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫైట్స్, యాక్షన్ సీన్స్ తో సాగుతుందట, ఇక ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి సినిమా రక్తికట్టి మంచి మాస్ ఫైట్ రావడంతో మొదటి భాగం ముగుస్తుందట. అసలు సినిమా కథ మెయిన్ ప్లాట్ అంతా సెకండ్ హాఫ్ లో ఉంటుందని, అమ్మాయిల మీద జరిగే అత్యాచారాలను నేపథ్యంగా తీసుకున్న దర్శకుడు మురుగదాస్, మంచి స్క్రీన్ ప్లే తో సెకండ్ హాఫ్ నడిపించినట్లు టాక్. 

 

అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్లు ఉన్నప్పటికీ కూడా, మధ్యలో వచ్చే ఇంటరెస్టింగ్ సీన్స్, ఫైట్స్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ వంటివి ఆకట్టుకుంటాయని, ఇక క్లైమాక్స్ కూడా బాగుంటుందని అంటున్నారు. ఓవర్ ఆల్ గా చెప్పాలంటే, మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా, పలు యాక్షన్, కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ సినిమా ఎబోవ్ యావరేజ్ సినిమాగా నిలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అయితే దీనిని కనుక ప్రేక్షకుల ఆదరిస్తే, హిట్ టాక్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. మరి మరొక రెండు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: