టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఇలా ఎక్కడ చూసిన బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. అంతేకాదు అలా తెరకెక్కించిన చాలా బయోపిక్స్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంటున్నాయి. దంగల్, మహానటి ..ఈ కోవకి చెందినవే. ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 కూడా మంచి కమర్షియల్ సక్సస్ ను సాధించింది. అక్షయ్ కుమార్ ప్యాడ్ మాన్ కూడా బాలీవుడ్ లో మంచి హిట్ సినిమాగా నిలిచింది. ఇక తాజాగా సైనా నెహ్వాల్ బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పరిణీతి చోప్రా సైనా గా నటిస్తోంది. ఆ పాత్ర కోసం దాదాపు నెల రోజులు మైదానంలో ప్రాక్టీస్ కూడా చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు మరో బయోపిక్ తెరమీదకు రాబోతోంది.

 

భార‌త‌దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ క్రేజ్‌ను సంపాదించ‌డం కోసం ఎంద‌రో క్రికెట్ ఆట‌గాళ్లు కృషి చేశారు. వాళ్ళలో అందరికంటే ముందు వ‌రుసలో ఉండే ఆట‌గాడు హ‌ర్యానా హ‌రికేన్ క‌పిల్‌దేవ్‌. 1983లో ప్ర‌పంచ క్రికెట్‌లో ఇండియాను విశ్వ‌విజేత‌గా నిలిపిన కెప్టెన్ క‌పిల్ దేవ్‌. ఈ అసాధార‌ణ జ‌ర్నీని ‘83’ సినిమాగా డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా ఇంగ్లాండ్ వెళ్లి ప్ర‌పంచ్‌క‌ప్‌ను సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్ సార‌థి కపిల్ దేవ్ పుట్టిన‌రోజు సోమ‌వారం(జ‌న‌వ‌రి 6). ఈ సంద‌ర్భంగా క‌పిల్‌దేవ్‌కి ‘83’ సినిమా యూనిట్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేసింది. ఈ సంద‌ర్భంగా 83 సినిమా షూటింగ్ సెట్‌లో కొన్ని క‌పిల్‌దేవ్‌, ర‌ణ్వీర్ సింగ్ క‌లిసి ఉన్న ఫొటోల‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేశారు. క‌పిల్ త‌న ఫేవ‌రేట్ ఐకానిక్ న‌ట‌రాజ్ షాట్‌ను ఎలా ఆడేవాడినో గుర్తుకు చేసుకుంటున్నాడు. అదే షాట్‌ను సినిమాలో ర‌ణ్వీర్ కూడా ఆడి చూపించ‌డం విశేషం.

 

ఈ సినిమాలో క‌పిల్‌దేవ్‌లా ర‌ణ‌వీర్ సింగ్, సునీల్ గ‌వాస్క‌ర్‌లా తాహిర్ రాజ్ బాసిన్, మ‌ద‌న్‌లాల్‌గా హార్డీ సంధు, మ‌హీంద‌ర్ అమ‌ర్‌నాథ్‌గా ష‌కీబ్ స‌లీమ్‌, బ‌ల్వీంద‌ర్ సింగ్ సంధుగా అమ్మీ విర్క్‌, కృష్ణ‌మాచారి శ్రీకాంత్‌గా జీవా, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్‌, స‌య్య‌ద్ కిర్మాణిగా సాహిల్‌ క‌త్తార్‌, దిలీప్ వెంగ్‌స‌ర్కార్‌గా అదినాథ్ కొతారి, ర‌విశాస్త్రి ధైర్య కార్వా, కృతి ఆజాద్‌గా దినేక‌ర్ శ‌ర్మ‌, య‌శ్‌పాల్ శ‌ర్మ‌గా జ‌తిన్ శ‌ర్నా, రోజ‌ర్ బ‌న్నిగా నిశాంత్ ద‌హియా, సునీల్ వాల్సన్‌గా ఆర్‌.బద్రి, ఫ‌రూక్ ఇంజ‌నీర్‌గా బోమ‌న్ ఇరాని, పి.ఆర్‌.మ‌న్‌సింగ్‌గా పంక‌జ్ త్రిపాఠిగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో క‌పిల్‌దేవ్ భార్య రోమీ పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనె అతిథిపాత్ర‌లో న‌టిస్తున్నారు. బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ‘83’ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 10న విడుద‌ల చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: