మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాల్లో సంక్రాంతికి వచ్చి హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడంటే సంక్రాంతికి పోటీలు పడి సెలవులను క్యాష్ చేసుకునేందుకు పోటీలు పడుతున్నారు కానీ.. దశాబ్దం క్రితం వరకూ కూడా సంక్రాంతి సందర్భంగా సినిమా అంటే జనవరి 1 నుంచే సందడి ప్రారంభమయ్యేది. అలాంటి సందడి చేసిన మెగాస్టార్ సినిమాల్లో ముగ్గురు మొనగాళ్లు, అన్నయ్య సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా చిరంజీవిలోని కామెడీ కోణాన్ని మరో స్థాయిలో స్పృశించినవే అని చెప్పాలి.

 

 

చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన ముగ్గురు మొనగాళ్లు 1994 జనవరి 7న విడుదలైంది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగాబాబు నిర్మాతగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. టైటిల్స్ లో మరో నిర్మాతగా పవన్ కల్యాణ్ పేరు కల్యాణ్ బాబుగా వేశారు. సినిమాలో పాటలన్నీ హిట్. మూడు డైమన్షన్స్ లో చిరంజీవి నటన అద్భుతం. నటరాజ దత్తాత్రేయ క్యారెక్టర్ లో చిరంజీవి నటన, పండించిన హాస్యం సినిమాకే హైలైట్ గా నిలిచాయి. రెగ్యులర్ కథ కావడంతో సినిమా ఎబౌవ్ యావరేజ్ గా నిలిచింది. చిరంజీవి మాస్ వదిలేసి కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తున్న సమయంలో ఆయన చేసిన మాస్ మూవీ ‘అన్నయ్య’.

 

 

2000 జనవరి 7న ఈ సినిమా విడుదలైంది. కథ ప్రకారం మెగా అభిమానులు చిరంజీవిని పిలుచుకునే ‘అన్నయ్య’ పిలుపునే టైటిల్ గా ఫిక్స్ చేశారు. సినిమాలో చిరంజీవి చేసిన మాస్ కామెడీ అదిరిపోయింది. పాటలన్నీ సూపర్ హిట్. కథా ప్రాధాన్యంతో పాటు సౌందర్యతో చేసిన రోమాన్స్ క్లిక్ అయింది. సాయిరాం ఆర్ట్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు. ముత్యాల సుబ్బయ్య తన మార్క్ దర్శకత్వం వహించి సినిమాను బ్లాక్ బస్టర్ గా మలిచారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: