తెలుగులో కథానాయకిగా  ఎంట్రీ ఇచ్చిన అంజలి  ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కథానాయికగా అందరు హీరోల సరసన నటించింది. సీనియర్ హీరోలతో పాటు జూనియర్ హీరోల సరసన కూడా ఛాన్సులు కొట్టేసి కెరీర్ పరంగా దూసుకుపోయింది అంజలి. అందాల ఆరబోతకు దూరంగాఉంటు...  విలక్షణమైన పాత్రలకు ఎంచుకుంటూ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది అంజలి. ఇప్పటికే నటనకు ప్రాధాన్యం ఉన్న ఎన్నో పాత్రల్లో నటించింది. తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. బాలకృష్ణ వెంకటేష్ రవితేజ వంటి స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేసేస్తుంది. తనదైన  అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది అంజలి. 

 

 

 తాజాగా ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరైన అంజలి తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆశక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఆలీతో సరదాగా ప్రోగ్రాం కి ఎప్పుడూ సెలబ్రిటీలు వస్తూ తమ నిజ జీవితానికి  సంబంధించిన కొన్ని ఆశక్తికర విషయాలను పంచుకుంటూ ఉంటారని తెలిసిందే . ఈ క్రమంలోనే అంజలి కూడా  ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సీనియర్ స్టార్ హీరోతో సినిమాలు చేయడం వల్ల యువ  కథానాయకులతో  సినిమాలు చేసే అవకాశాలు కోల్పోయే అవకాశం ఉండి  అని చాలా మంది అంటుంటారు అందులో ఎంతమాత్రం నిజం  ఉండదు అంటూ అంజలి చెప్పుకొచ్చింది. 

 


 నేను సీనియర్ హీరోలతో చేసినప్పటికీ జూనియర్ హీరోల సరసన కూడా అవకాశాలు వచ్చాయి అంటూ  తెలిపింది. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లానని  చెప్పుకొచ్చారు. 10 సినిమాలు ఒకేసారి చేసెయ్యాలి అని నేనెప్పుడూ ఆశ పడలేదని.. 10 సంవత్సరాల పాటు గుర్తుండిపోయే సరైన పాత్ర ఒక్కటి చేస్తే చాలు అని ఎప్పుడూ నేను అనుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. తాను అలా అనుకోవడం వళ్లే సీతమ్మ  వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమా చేయగలిగానంటు తెలిపింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్ర ఇప్పుటికీ   తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోలేరు అని తెలిపిన అంజలి.. సినిమాల సంఖ్య కంటే బలమైన పాత్రలే మనను ఒక నటిగా నిలబెట్టాయి అని నేను నమ్ముతాను అంటు  చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: