సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరో ఒక దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చేసి నాతో సినిమా చేయమని అడిగితే ఎవరైనా రాయకుండా ఉంటారా? ఎంతో మంది దర్శకులకు అతనితో పనిచేయడం ఒక డ్రీమ్ అని చెప్పవచ్చు. అయితే యువ దర్శకుడు మారుతి మాత్రం మహేష్ కు సరిగ్గా స్పందించలేదు. తన తొలి నాళ్లలో యువతను ఆకట్టుకునే చిత్రాలతో సెన్సేషన్ సృష్టించిన మారుతీ కొద్ది నాళ్ళు 'బూతు' డైరెక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. అయితే క్రమేపీ కుటుంబపరమైన చిత్రాలు చేస్తూ ఆ పేరును పోగొట్టుకొని కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు.

 

మహేష్ బావ సుధీర్ బాబు హీరోగా పెట్టి మారుతి 'ప్రేమకథాచిత్రం' తీయగా అది హర్రర్ కామెడీ లో ఒక రిఫరెన్స్ గా నిలిచింది. అప్పట్లో సుధీర్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన మారుతిని చూసి మహేష్ ఇంప్రెస్ అయి ట్వీట్ వేసాడు కూడా. ఆ తర్వాత మారుతి కి ఒక చెక్ ఇప్పించి తనకోసం కథ రాయమని చెప్పినట్లు మారుతి ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు. అయితే మహేష్ అడ్వాన్స్ ఇచ్చినా కూడా మారుతి అతని కోసం ఏ కథా సిద్ధం చేయలేదట. అలాగే మహేష్ తో పాటు అల్లు అర్జున్ కూడా తనతో సినిమా చేయాలని మారుతి ను కోరినట్లు తెలిపారు. 

 

అలా ఇద్దరు పెద్ద హీరోలను తాను డైరెక్ట్ చేయలేకపోయినందుకు గల కారణాలు వివరిస్తూ... స్టార్ హీరోలతో చేస్తే సినిమా మామూలుగా ఉండకూడదని.. దాని బడ్జెట్ ఎక్కువ ఉంటుందని, అలాగే దాని తాలూకు ఒత్తిడి కూడా మామూలుగా ఉండదని.. కాబట్టి వీటికి మనం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామా అని చూసుకోవాలని.. ఇంతకుముందు తనకు ఆ కాన్ఫిడెన్స్ ఉండేది కాదని.. కానీ ఇప్పుడు అది వచ్చిందని మారుతి తెలిపాడు. 

 

కానీ ఇప్పుడు సినిమాలో 30 మంది ఆర్టిస్టులను పెట్టుకొని ప్రతిరోజూ షూటింగ్ చేసి తాను హిట్ కొట్టానని చెప్పిన మారుతి ఇకపై భారీ చిత్రాన్ని డీల్ చేయగలనన్న ఆత్మవిశ్వాసం వచ్చింది అన్నాడు. త్వరలోనే ఒక పెద్ద స్టార్ తో సినిమా చేయాలనుకుంటున్నట్లు కూడా మారుతి వివరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: